సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుంటే... దానిని ఉపయోగించి నేరాలకు పాల్పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజుకో కొత్త రకం మోసంతో సైబర్ నేరగాళ్ళు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ టీం పోలీసులు సుమారు 300కు పైగా మందిని అరెస్టు చేశారు. వీరిలో అధిక సంఖ్యాకులు రాజస్థాన్ కు చెందిన వారు కావడం గమనార్హం.
హైదరాబాద్ కు చెందిన సైబర్ నేరగాళ్లు కేవలం 86 మంది ఉంటే.. మిగతా రాష్ట్రాలకు చెందిన వారు రెండు వందల ఎనభై కి పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వారిలో ఎక్కువ మంది రాజస్థాన్ కు చెందిన వారు ఉన్నారని చెప్పారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల్లో ప్రజలను లూటీ చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రధానంగా రెండు రకాల నేరాలకు పాల్పడుతుంటారు. వాటిలో ఒకటి ఆర్థికపరమైన అంశమైతే మరొకటి సోషల్ మీడియాను ఉపయోగించి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం మరొకటి. మొదటి దానిలో సంబంధిత వ్యక్తులకు మెసేజ్, మెయిల్స్, కాల్స్, ఆఫర్స్ లాంటి పద్దతులను ఉపయోగించి వారి వద్ద ఉన్న సొమ్మును ఇట్టే కాజేస్తారు. ముఖ్యంగా ఆఫర్స్ ని ఉపయోగించి సొమ్ములు కాజేయడం లో సైబర్ కేటుగాళ్లు సిద్ధహస్తులు.
'మీకు ఫలానా దానిపై ఆఫర్ ఉంది. ఇందుకు మీరు కొంత మొత్తం కట్టాల్సి ఉంటుందని' చెప్తారు. దీనికి ఆశపడే మన దగ్గర ఉన్న డబ్బుని చెల్లిస్తే... వారి నుంచి తిరిగి ఫోన్ కాల్ అనేది ఉండదు. మనం మోసపోయాం అనే విషయం కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. ఇలా మోసపోయే వారి జాబితా అంతకంతకూ పెరుగుతూ పోతుంది అని అధికారులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లు క్రైం కు పాల్పడే వాటిలో రెండో పద్దతి ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఉండే సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వ్యక్తుల గోప్యతకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. వారికి సంబంధించిన అశ్లీల దృశ్యాలను ప్రదర్శించడం కానీ అభ్యంతరకరమైన విషయాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం గానీ చేస్తారు.
ఎలా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు. తెలంగాణలో సైబర్ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎక్కువ మంది ఈ కోవకు చెందిన వేరే కావడం గమనార్హం. వీరు ఈ నేరాలకు పాల్పడేందుకు టార్గెట్ చేసిన వ్యక్తుల కంప్యూటర్, ఫోన్ ఉపయోగించి వారి డేటాను అపహరించి ఇలా చేస్తారు. ఈ నేరాలకు పాల్పడే వారిలో ఎక్కువ మంది చదువుకున్న వారే కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది.
సైబర్ నేరాల్లో ప్రధానమైనవి ఆర్థిక నేరాలు ఇటీవల కాలంలో ఎక్కువ ఇవి వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను ఉపయోగించే వ్యక్తులకు తక్కువకే ఖరీదైన వస్తువులను ఇస్తున్నట్లు చెబుతూ బాధితులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. అంతేకాకుండా ఫేస్ బుక్ లో ఉండే ఓపెన్ అకౌంట్లను టార్గెట్ గా చేసుకుని అలాంటి మరో ఫేస్బుక్ ఖాతా తెరిచే ఫ్రెండ్ లిస్టులో ఉండేవారికి అర్జెంటుగా డబ్బులు కావాలని ఈ మెసేజ్ లు పెడుతూ అందినకాడికి దోచేస్తున్నారు.
మరి కొందరు అయితే ఫేక్ అకౌంట్ తో మంచిగా చాట్ చేస్తూ ప్రేమ పేరుతో నూడ్ కాల్స్ చేసి వారిని బెదిరిస్తారు. ఇలా కూడా బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలా నేరాలకు పాల్పడే వారు ఎక్కువ భాగం దిల్లీ, హరియాణా, రాజస్థాన్ లకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిలో అంతర్ రాష్ట్రాలకు చెందిన వారే కాక ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.
ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి హైదరాబాద్ కు చదువుకునేందుకు వచ్చినవారు ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జార్ఖండ్ కు చెందిన ఒక టీం ఏకంగా తాము బ్యాంకు అధికారుల మనీ ఫోన్ చేసి ఓటిపి చెప్పాలని అడుగుతున్నారు. ఇలా ఓటిపి చెప్పగానే బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు దెబ్బకు ఖాళీ అవుతున్నాయి. ఇలా వివిధ రకాలైన పద్ధతుల్లో సైబర్ కేటుగాళ్ళు దోపిడీలకు పాల్పడుతున్నారు.