ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఓవైపు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ 'యువగళం' పేరుతో 4 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని చంద్రబాబు కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ 'వై నాట్ 175' అనే నినాదంతో తన శ్రేణులను ముందుకు నడుపుతున్నారు. అయితే ముందుగా ఒక నియోజకవర్గంలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ ఢంకా మోగించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉందని అంటున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టు మళ్లీ మంగళగిరి నుంచే పోటీకి లోకేష్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పుడో కార్యాచరణ మొదలుపెట్టేశారు. ఓటమి పాలైనప్పటి నుంచే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కలియదిరిగారు. 'బాదుడే బాదుడు', 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాలు నిర్వహించారు.
అయితే ఇప్పుడు లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పార్టీ కార్యక్రమాలను స్థానిక నేతలు నిర్వహిస్తున్నారు. లోకేష్ లేని లోటు తెలియకుండా కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. ఓవైపు అన్న క్యాంటీన్, మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య రథం (మొబైల్ మెడికల్ వ్యాన్) ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని అన్ని గ్రామాలకు పంపుతూ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అవసరమైనవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ఇంకోవైపు మంగళగిరిలో టీడీపీ కార్యక్రమాలను చంద్రబాబు నిత్యం తెలుసుకుంటున్నారు. స్థానిక నేతలతో మాట్లాడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ మంగళగిరిలో ఘన విజయం సాధించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.
మరోవైపు వైసీపీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గంజి చిరంజీవిని వైసీపీ తనలోకి లాగేసింది. ఆయనకు వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. మంగళగిరిలో పద్మశాలీల జనాభా ఎక్కువ. దీంతో ఆ వర్గానికి చెందిన చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు. అలాగే పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
టీడీపీ కూడా వెనక్కి తగ్గడం లేదు. వైసీపీలో ఉన్న మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్ కాండ్రు కమల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ఎత్తులకు పైఎత్తులతో అధికార, ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎవరికి విజయం కట్టబెడతారో వేచిచూడాల్సిందే!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.