చైతన్య మాస్టర్ సూసైడ్ వెనుక అసలు కారణం చెప్పిన ఫ్రెండ్

Update: 2023-05-01 18:00 GMT
ఎప్పుడూ సంతోషంగా ఉంటూ.. తాను నవ్వుతూ అందరిని నవ్వించే చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకోవటాన్ని తాము నమ్మటం లేదని అతని గురించి తెలిసిన వారంతా ఇప్పుడు చెబుతున్నారు. చైతన్య మాస్టర్ ఆత్మహత్య గురించి తెలిసినంతనే హైదరాబాద్ నుంచి పలువురు నెల్లూరుకు చేరుకున్నారు. ఢీ కొరియోగ్రాఫర్ గా సుపరిచితులైన చైతన్య మాస్టర్ ఆత్మహత్య వెనుక డబ్బు కారణం కాదన్న మాట వినిపిస్తోంది.

శనివారం నెల్లూరులో కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేతుల మీదుగా చైతన్యకు సన్మానం జరిగింది. చైతన్య స్వస్థలం నెల్లూరు జిల్లా కావటికి దగ్గర్లోని మట్టువారి పాలెం. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి.. డాన్సు మీద మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. ఢీ షోతో పాపులర్ అయ్యారు.

తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు.. ఆ విషయాన్ని సెల్ఫీ వీడియోతో అందరికి పంచుకున్న అతను.. కాసేపటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తానుఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు. తల్లిని.. చెల్లిని.. స్నేహితులకు సారీ చెప్పిన అతని మాటల్ని అతను స్నేహితులు అంగీకరించటం లేదు. చైతన్య డబ్బు కోసం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే చైతన్య.. తన రూం మేట్ గా నాలుగేళ్లుగా ఉన్నాడని.. చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆత్మహత్య పరిష్కారం కాదని అతని రూమ్మేట్ వాపోయాడు.

రెండు రోజుల క్రితం తాను చైతన్యతో ఫోన్లో మాట్లాడానని.. సరదాగా మాట్లాడుకున్నామని.. తాను బాధ పడుతున్న విషయాన్ని తమకు ఎవరికి చెప్పలేదన్నారు. ఎలారియాక్టుకావాలో తమకే అర్థం కావట్లేదని స్నేహతుడు పండు వ్యాఖ్యానించాడు. జీవితం అంటే ఎలా ఉండాలన్న దానిపై చైతన్య మాస్టర్ కు స్పష్టమైన అవగాహన ఉందని.. పది మందికి చెప్పేవాడు ఆర్థిక సమస్యలని చెప్పి ఆత్మహత్య చేసుకోవటాన్ని తాను నమ్మట్లేదని చైతన్య స్నేహతుడు ఒకరు వ్యాఖ్యానించారు.

ఢీ సీజన్ లో గెలుపు కాస్తలో తప్పిపోయిందని.. అది మిస్ కావటంతోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డబ్బుల విషయంలో ఎవరూ అతన్ని ఒత్తిడి పెట్టింది లేదన్నారు. ఏ ఆర్గనైజర్ ను చైతన్య అడిగినా డబ్బులు అడిగినా ఇస్తారని.. అందుకోసం ఆత్మహత్య చేసుకోవటం నిజం కాదని వ్యాఖ్యానించాడు. చైతన్య మాస్టర్ ఆత్మహత్య పై నటి శ్రద్ధాదాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ఒక పోస్టు పెట్టారు.

ఆయనతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఆమె.. ‘మనం పుట్టిన దగ్గర నుంచి జీవించే చివరి వరకు ఎలా బతికామన్నది మన గొప్పతనాన్ని సూచిస్తుంది. చైతన్య మాస్టర్ మంచి మనసున్న వ్యక్తి. చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటాడు. ఎంతో సరదాగా ఉండేవాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ నవ్వించే ఆయన ఈ రోజు మాత్రం బాగా ఏడిపించారు.వార్త తెలిసినప్పటి నుంచి ఏడూస్తూనే ఉన్నాను’ అంటూ పోస్టు పెట్టారు. చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. ఈ వార్తనుంచి తాను బయటకు రాలేకపోతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. చావు పరిష్కారం కాదు చైతన్య మాస్టర్ అంటూ యాంకర్ రష్మీ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News