నా కిడ్నాపింగ్ లో ఆ మహిళ హస్తం: మెహుల్ చోక్సీ

Update: 2021-06-07 16:30 GMT
అంటిగ్వా నుంచి తనను డొమినికాకు కిడ్నాప్ చేయడానికి పన్నిన కుట్రలో బార్బరా జరాబికా అనే మహిళ పాత్ర ఉందని భారత్ లో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు.ఈ మేరకు పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా ఆమెకు, తనకు స్నేహం ఉందని.. ఆమె జోలీ హార్బర్ లోని తన ఇంటి సమీపంలో ఉండేదని.. ఆ తర్వాత కోకోబే అనే హోటల్ లోకి మారిందని ఆయన వెల్లడించాడు.

నా స్టాఫ్ తోనూ ఆమె ఫ్రెండ్లీగా ఉండేదని.. మేం రెగ్యులర్ గా మాట్లాడుకునే వాళ్లమని.. సాయంత్రం వాకింగ్ కి వెళ్లే వాళ్లమని చోక్సీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

మెరినా అనే ప్రాంతంలో కలుసుకోవాలని మే 23న ఆమె చెప్పిందని.. దాంతో ఆ రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో అక్కడికి వెళ్లిన తనను ఆహ్వానించిందని వెల్లడించాడు. మేం అలా మాట్లాడుతుండగానే 10 మంది వరకు వచ్చి.. అంటిగ్వా పోలీసులమని చెప్పి తీవ్రంగా దాడి చేశారన్నారు. బర్బారా అక్కడే ఉన్న ఏమాత్రం స్పందించలేదని.. కేకలు వేయలేదని.. తనను కిడ్నాప్ చేయడానికి పన్నిన కుట్రలో ఇదంతా భాగమని తెలుస్తోందన్నారు.

తనను ఎత్తుకుపోయి ఓ బోటులో చేర్చారని.. అందులో ఇద్దరు భారతీయులు, ముగ్గురు డొమినికావాసులు ఉన్నారని.. కిరాయి కాంట్రాక్టర్ల మాదిరి ఉన్నారని అర్థమైందన్నారు. పథకం ప్రకారం తనను సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి డొమినికా తరలించారన్నారు. బార్బరా పాత్ర ఇందులో స్పష్టంగా ఉందని తెలిసిపోయిందన్నారు. తన భర్త కిడ్నాప్ తర్వాత బార్బారా కనిపించడం లేదని చోక్సీ భార్య చెప్పారు. దీన్ని బట్టి చోక్సీ కిడ్నాప్ వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపిస్తున్నాడు.
Tags:    

Similar News