నీతులు చెప్పే రాజకీయ పార్టీల మాటలకు చేతలకు మధ్య అంతరం తెలిసిందే. అయితే.. అదెంత ఎక్కువగా ఉంటుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని ఎంపీ.. ఎమ్మెల్యేల్లో నేరాలకు పాల్పడిన కేసులు ఎదుర్కంటున్న వారి లెక్క తేల్చే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి గడిచిన ఐదేళ్లలో (2014-19) మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని పార్టీల్ని పరిగణలోకి తీసుకొని గణాంకాల్ని తయారు చేసింది.
ఎన్నికల సందర్భంగా వారు అందజేసిన అఫిడవిట్లను పరిశీలించి నివేదికను తయారు చేసింది. దీనిప్రకారం చూస్తే.. ఆ చెత్త రికార్డు అధికార బీజేపీ.. విపక్ష కాంగ్రెస్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు మొత్తంగా 18 మంది ఎంపీలు ఉండగా.. 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలక్క తేల్చింది. కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు (ఎంపీ/ఎమ్మెల్యే) పార్టీల వారీగా చూస్తే అత్యధికంగా బీజేపీలో 21 మంది కాంగ్రెస్ లో 16 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏడుగురు.. బీజేడీలో ఆరుగురు.. టీఎంసీలో ఐదుగురు.. టీఆర్ఎస్ లో నలుగురు.. ఇండిపెండెంట్లలో ముగ్గరు.. డీఎంకేలో ఇద్దరు ఎన్సీపీలో ఇద్దరు.. ఆర్జేడీలో ఇద్దరు.. శివనసేనలో ఇద్దరు.. టీడీపీలో ఒకరు.. సీపీఎంలో ఒకరు.. జేఎంఎంలో ఒకరు ఉన్నట్లు తేల్చారు.
మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో చూస్తే ఎక్కువగా పశ్చిమబెంగాల్ లో ఉంటే.. తర్వాతి స్థానాల్లో ఒడిశా.. మహారాష్ట్రలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తీవ్రమైన అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్నట్లుగా తేల్చారు.