ఘాటు వ్యాఖ్యలు.. ముఖం పగిలేలా పంచ్ లు.. వార్తల్లో ప్రముఖంగా ఫేమస్ అవ్వాలన్న తాపత్రయం.. వెరసి సీపీఐ నారాయణగా చెప్పొచ్చు. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన.. ఏ మాత్రం అవకాశం వచ్చినా.. ముఖం పగిలేలా వ్యాఖ్యల్ని సంధిస్తుంటారు.
ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ గా అభివర్ణించి.. సంచలనంగా మారారు నారాయణ. పుసుక్కున అంత మాట అనేశావేంటి నారాయణ? అంటూ ప్రశ్నించినోళ్లు లేకపోలేదు. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గని ఆయన.. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేయటం తెలిసిందే.
తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అని ఎందుకు అన్నట్లు? అంత మాత్రం మాట అనటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నల నేపథ్యంలో నారాయణ ఓపెన్ అయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా మనసులోని మాటను చెప్పేశారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..
‘‘బిగ్ బాస్ షోలో నాగార్జున ముగ్గురు అమ్మాయిల్ని పిలిచి.. ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు..? ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు? ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావని అడుగుతాడు. ఆడపిల్లలను పట్టుకొని ఇలా మాట్లాడుతుంటే సహించలేకపోయా. నాగార్జున అంటే నాకూ ఇష్టమే. బిగ్ బాస్ తర్వాత నాగార్జున అంటే నాకు అసహ్యం ఏర్పడింది. అందుకే బ్రోతల్ హౌస్ నడపుతావా? అని వ్యాఖ్యానించా’’ అని పేర్కొన్నారు.
తాను అన్న బ్రోతల్ హౌస్ మాటల్ని పట్టుకొని తనపై కేసు వేస్తానని హెచ్చరించారని.. పెట్టుకుంటే పెట్టుకొమ్మని చెప్పినట్లుగా వెల్లడించారు. ఇదేమీ గేమ్ కాదు.. క్రైమ్ అన్న నారాయణ.. బిగ్ బాస్ షో మీద తనకున్న ఆగ్రహాన్ని నిర్మోహమాటంగా వెల్లడించారు.