పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మానసి జోషి నిరూపించింది. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా కూడా రాకెట్ పట్టి బరిలోకి దిగింది. మొండిగా కష్టపడింది. పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాల పంట పండించింది. 2019లో ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి భారత దేశ ఘనత చాటింది.
మానసి జోషి.. ముంబైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో కెరీర్ ఆరంభించింది. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే మానసి రోడ్డు ప్రమాదానికి గురైంది. 2011 డిసెంబర్ లో ద్విచక్రవాహనంపై ఆఫీసుకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఆమె కిందపడడంతో ఎడమకాలిపై నుంచి లారీ వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లే సరికి ఆలస్యం కావడంతో ఎడమకాలును పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. 45 రోజుల తర్వాత కోలుకుంది. కఠిన పరిస్థితులను అధిగమించాలని పట్టుదలతో ప్రయత్నించింది.
మానసి నడవడానికి కూడా వీలులేని స్థితిలో ఒక ప్రొస్థెటిక్ కాలును ఏర్పాటు చేసుకొని బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. తన తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆయనతో సాధన చేసింది. పారా ఒలంపిక్స్ లో పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని 2015 నుంచి 2019 వరకు వివిధ పతకాలు సాధించింది. ఈ ఆటతో గుర్తింపు తెచ్చుకొని చాంపియన్ గా మారింది.
2018లో హైదరాబాద్ లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి అత్యుత్తమ శిక్షణ తీసుకుంది. 2019 బాసెల్ లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచం దృష్టిలో పడింది.
మానసి విజయగాథను తెలుసుకున్న బార్డీడాల్ హీరోస్ సంస్థ ఆమెకు అరుదైన గుర్తింపు ఇస్తూ ఆమె పోలికలతో ఒక మోడల్ బొమ్మను రూపొందించి అందించింది. అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఆమెకు స్థానం కల్పించింది. అమ్మాయిలకు స్ఫూర్తి ప్రదాతగా మానసి జోషి నిలిచింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించవచ్చని మానసి నిరూపించింది.