అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన కుమార్తెను కిడ్నాప్ చేసి.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని కోర్టు ఆవరణలోనే చంపేసిన తండ్రి వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తన కుమార్తె విషయంలో వ్యవహరించిన తీరును ఆగ్రహించిన సదరు తండ్రి బీఎస్ఎఫ్ మాజీ జవానుగా ఉన్నారు.
షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో చోటుచేసుకుంది. మరణించిన వ్యక్తి బిహార్ లోని ముజుఫర్ పూర్ కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..
దాదాపు రెండేళ్ల క్రితం (2020 ఫిబ్రవరి 12న) బిహార్ కు చెందిన దిల్షాద్ హుస్సేన్ అనే పాతికేళ్ల యువకుడు బీఎస్ఎఫ్ మాజీ జవాను కుమార్తె 16 ఏళ్ల భగవత్ నిషాద్ ను కిడ్నాప్ చేశాడు. తన కుమార్తె కనిపించకుండా పోయినట్లుగా ఆమె తండ్రి ఫిబ్రవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను కిడ్నాప్ చేసిన అమ్మాయిని హైదరాబాద్ కు తీసుకొచ్చిన దిల్షాద్.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు 2021 మార్చిలో బాలికను పోలీసులు కాపాడారు.
అనంతరం ఆమెను తల్లిదండ్రులకు అప్ప జెప్పారు. పోక్సో చట్టం కింద నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అనంతరం జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యాడు. ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరయ్యేందుకు దిల్షాద్ గోరఖ్ పూర్ కోర్టు ఆవరణకు వచ్చారు. తన తరఫున కేసును వాదించే లాయర్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ సందర్భంగా అప్పటికే కోర్టు ఆవరణలో వెయిట్ చేస్తున్న బాధితురాలి తండ్రి భగవత్ నిందితుడ్ని కాల్చి చంపాడు.
ఈ అనూహ్య పరిణామం పెను కలకలాన్ని రేపింది. కోర్టు ఆవరణలో ఉన్న వారు.. కాల్పులు జరిపిన భగవత్ ను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించటంతో వారు అతడ్ని అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి బదులుగా.. నిందితుడ్నికోర్టు ఆవరణలోనే కాల్చేసిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.