లేఖలో జగన్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి: ప్రశాంత్ భూషణ్

Update: 2020-10-11 13:26 GMT
జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డేకు రాసిన లేఖపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.

ఎన్వీ రమణ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ ఈ లేఖ ద్వారా  ప్రధాన న్యాయమూర్తికి జగన్ ఫిర్యాదు చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు తరుఫున న్యాయస్థానాల్లో తన ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారంటూ  వైఎస్ జగన్ చేసిన ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ప్రశాంత్ భూషణ్ అన్నారు. దీనిపై శరవేగంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దర్యాప్తు ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను కాపాడినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక బీజేపీ నేత, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సైతం ఈ వివాదంపై  స్పందించారు. వైఎస్ జగన్ రాసిన లేఖపై జాతీయ స్థాయిలో ఓ చర్చ ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ న్యాయాధికారుల నియామక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగులో స్వతంత్ర ప్రింట్ మీడియా లేకపోవడం.. తెలుగు ప్రజల దౌర్భగ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీడియా మాత్రం స్వతంత్రంగా పనిచేయలేకపోతోందని అన్నారు.
Tags:    

Similar News