సంచయితకు మరో పదవి.. అశోక్ గజపతికి షాక్

Update: 2020-11-16 16:10 GMT
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక పదవి కట్టబెట్టింది. అదే సమయంలో అశోక్ గజపతిరాజుకు గట్టి షాక్ ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 2న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్ గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చైర్మన్ గా కొనసాగారు.

ఏపీలో ప్రభుత్వం మారాక అశోక్ గజపతిరాజును ఈ బాధ్యతల నుంచి తప్పించి సంచయితను వారసురాలిగా నియమించి చైర్మన్ గా చేశారు. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 27న ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా సంచయితను 104 ఆలయాలకు కూడా చైర్ పర్సన్ గా నియమించింది. ఇప్పటివరకు 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించింది.

కాగా తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థానంలో సంచయితను నియమించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు అర్ధరాత్రి జీవోలకు నిదర్శమని విమర్శించారు.


Tags:    

Similar News