‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా బ్యాంక్ మన్ ఫ్రీడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. క్రిప్టో కరెన్సీ.. ఎఫ్టీఎక్స్ పతనానికి ముందు వాషింగ్టన్ లోని ముఖ్య వ్యక్తుల్లో ఒకరిగా బ్యాంక్ మన్ ఫ్రీడ్ నిలిచారు. దీంతోపాటు వామపక్ష.. ప్రజాస్వామ్య భావజాలం కలిగిన రాజకీయ కార్యక్రమాలకు బ్యాంక్ మన్ ఫ్రీడ్ మిలియన్ల డాలర్లను విరాళం ఇచ్చి గతంలో వార్తల్లో నిలిచారు. అయితే ఒక్క నెలలో అతడి కథ మొత్తం రివర్స్ అయింది.
ఇటీవలి కాలంలో ఎఫ్టీఎక్స్ సంస్థ భారీగా దివాళా తీయడంతో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది క్రిఫ్టో కరెన్సీ మదుపరులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అయితే ఈ దివాలాను ఆపేందుకు బ్యాంక్ మన్ ఫ్రీడ్ శతవిధాలా ప్రయత్నించారు. 800 కోట్ల డాలర్లను సేకరించే క్రమంలో విఫలమయ్యారు.
ఈ ఏడాది జనవరిలో ఎఫ్టీఎక్స్ షేర్ విలువ భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే ఎఫ్టీఎఫ్ మార్కెట్ విలువను 3వేల200 కోట్లగా లెక్క గట్టారు. 2019లో స్థాపించబడిన ఎఫ్టీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 134 అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. క్రిప్టో కరెన్సీ పతనంతో ప్రస్తుతం ఈ సంస్థలపై 5 వేల డాలర్ల అప్పులున్నాయి.
మరోవైపు ఎఫ్టీఎక్స్ వెంచర్లో పెట్టుబడి దారులు.. ఫించన్ నిధులు.. కంపెనీలు.. ఇతర భారీ మధుపరులు వందల కోట్ల డాలర్లను గుమ్మరించారు. చివరకు ఎఫ్టీఎక్స్ ఉద్యోగులు సైతం క్రిష్టోపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈమేరకు నిరుడు ఎఫ్టీఎక్స్ ఇతర ఎక్సేంజ్ సంస్థలకు 740 కోట్ల డాలర్లను రుణం ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం తానే బోల్తా కొట్టింది.
ఈ క్రమంలోనే హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ ముందు బ్యాంక్ మన్ ఫ్రీడ్ హాజరు కావాల్సిన ఒక రోజు ముందే అతడిని బహమాన్ పోలీసులు అరెస్టు చేశారు. చట్టాలను ఉల్లంఘించి ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ ఎఫ్టీఎక్స్ పతనానికి కారణమైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టేందుకు అమెరికాతో కలిసి పని చేస్తామని బహమాస్ ప్రధాని ఫిలిప్ డేవిడ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే బ్యాంక్ మన్ ఫ్రీడ్ పై అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్ సైతం కేసు పెట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికా సెక్యూరిటీ నిబంధనలను సైతం ఫ్రీడ్ ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అమెరికా దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు ఫ్రిడ్ ను అదుపులోకి తీసుకున్నట్లు బహమాస్ పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్టీఎక్స్ పతనంతో ఇరు దేశాల్లోనూ ఫ్రిడ్ పై పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.