తమిళనాడు లో ఈ మధ్యనే ఎన్నికలు ముగిశాయి. డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఇప్పట్లో ఇక ఎన్నికలు కూడా లేవు. కానీ, ఈ పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్ అధికారి కే.అణ్నామలై బీజేపీ తమిళనాడు రాష్ట్రాధ్యక్షుడిగా నియమింపబడ్డారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కరూర్ జిల్లాకు చెందిన కే.అణ్నామలై 2011 కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన వయస్సు కేవలం 37 సంవత్సరాలు. అత్యంత చిన్న వయస్సులో తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులైన వ్యక్తి అణ్నామలై కావడం విశేషం. బీజేపీలో చేరి ఏడాది పూర్తికాకముందే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవడంమరో విశేషం.
తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చిన ఎల్ మురుగన్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నారు. దీనితో ఆయన స్థానంలో కే.అణ్నామలైను పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కే.అణ్నామలై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులుకావడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈయనే బీజేపీ అధ్యక్షుడు అంటూ గత కొన్ని రోజులుగా తమిళనాడులో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కర్ణాటకలోని చిక్కమంగళూరు, ఉడిపి జిల్లాలకు ఎస్పీగా, బెంగళూరు(దక్షిణ) డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన ఆయన 2019 సెప్టెంబర్ లో ఐపీఎస్ సేవల నుంచి వైదొలిగారు. ఐపీఎస్ సర్వీస్ కు వీడ్కోలు పలికిన 11 నెలల తర్వాత 2020 ఆగస్టులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమింపబడ్డారు. ఈ మద్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అన్నాడీఎంకే మద్ధతుతో బరిలో నిలిచిన ఆయన అక్కడ కేవలం 24,816 ఓట్ల తేడాతో ఆయన డీఎంకే అభ్యర్థి ఆర్ ఇళంగో చేతిలో ఓడిపోయారు.
ఇకపోతే , ఈ మధ్యనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు లో బీజేపీ అనుకున్నంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో 2024 లోక్ సభ ఎన్నికలకు అక్కడ పార్టీని సన్నద్ధం చేయడం అణ్నామలై ముందున్న అతి పెద్ద సవాల్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. యువ నాయకుడికి పార్టీ సారధ్య బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా తమిళనాడులో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ అగ్రనేతలు ఆశిస్తున్నారు. సింగం పోలీస్ ఆఫీసర్ గా ఆయన కర్ణాటకలో మంచి పేరు ఉంది. ఆ విదంగానే తమిళనాడులో బీజేపీ జెండా రెపరెపలాడిస్తాడు అని బీజేపీ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. తమిళనాడులో పార్టీ నిర్మాణం కోసం ఎందరో నేతలు, కార్యకర్తలు సేవలందించారని అణ్నామలై గుర్తుచేసుకున్నారు. వారి త్యాగాలు వృధా కానివ్వబోనని చెప్పారు. తమిళనాడు ప్రజలకు పార్టీని దగ్గర చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.