దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అధికార టీఆర్ ఎస్ పార్టీని బీజేపీ చిత్తు చేసింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో జయకేతనం ఎగురవేశారు. ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్ లో చివరి మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యత సాధించడంతో, బీజేపీ చివరకు విజయనాదం చేసింది. 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. ఈ ఎన్నికలో బీజేపీ 62,772 ఓట్లను సాధించింది. 61,320 ఓట్లను సాధించిన టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 21,819 ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. బీజీపీ గెలుపును కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది.
ఇదిలా ఉంటే ఈ ఫలితాలు టిఆర్ ఎస్ కి ఓ హెచ్చరిక లాంటివి. అయితే , దుబ్బాక ప్రజలు మంత్రి హరీష్ రావు కి సైతం షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా, ఉపఎన్నికల కింగ్ గా పేరు గాంచిన మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ పై చేయి సాధించి మంత్రికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. హరీష్ రావు దత్తత గ్రామం చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది.