రోడ్డు మీద ఇద్దరు కానిస్టేబుళ్ల దారుణ హత్య

Update: 2021-04-16 04:30 GMT
బైక్ మీద వెళుతున్న ఇద్దరుకానిస్టేబుళ్లను దారుణంగా హత్య చేసిన ఉదంతం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సుకుమా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బెజ్జి పోలీస్ స్టేషన్ కు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్ (29), ధనిరాం కశ్యప్ (31) బైక్ మీద ఒక గ్రామంలోని ఆసుపత్రికి వచ్చారు.

అక్కడ నుంచి తిరిగి వస్తుండగా.. వారిని అడ్డుకున్న గుర్తు తెలియని వ్యక్తులు.. పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. తీవ్ర గాయాలతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన ఇద్దరు పోలీసుల్లో ఒకరిని దంతెవాడ జిల్లా నేతల్ నార్ కాగా.. కశ్యప్ ది జేగురుగొండ గ్రామంగా చెబుతున్నారు. వీరిని హత్య చేసింది పాత కక్షలతోనా? ఇంకేదైనా కారణం ఉందా? అన్నది తేల్లేదు. ఈ ఘటన వెనుక మావోలు ఉన్నారా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. ఈ దారుణ హత్యలు స్థానికంగా సంచలనంగా మారాయి.
Tags:    

Similar News