మోడీ ఇమేజ్ కు మాయని మచ్చగా బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే

Update: 2022-07-22 03:05 GMT
నికార్సైన పాలనకు కేరాఫ్ అడ్రస్ గా మోడీ పాలనను చెబుతుంటారు బీజేపీ నేతలు. మరి.. అలాంటి నేత చేతుల మీదుగా ఒక భారీ ప్రాజెక్టును ఓపెన్ చేయించినప్పుడు.. దాని నాణ్యత విషయంలో ఒకటికి రెండుమార్లు చెక్ చేసుకోవటం కనిపిస్తోంది.

అందుకు భిన్నంగా.. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఐదు రోజులకే నాణ్యత విషయానికి సంబంధించి సంచలన ఉదంతాలుచోటు చేసుకోవటం షాకింగ్ గా మారాయి. ఐదు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతలు మీదుగా బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించారు. 296 కిలో మీటర్ల పొడవైన ఈ నాలుగు రోడ్ల లైన్ ను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.8వేల కోట్లను ఖర్చు చేశారు. ప్రస్తుతం నాలుగు లైన్లు ఉన్న ఈ రోడ్డును రాబోయే రోజుల్లో ఆరు లైన్లుగా విస్తరించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయటం గమనార్హం. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కారణంగా ఉత్తరప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో.. మధ్యప్రదేశ్ లోని ఆరు జిల్లాలకు ఈ రహదారి విస్తరించి ఉండటం వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.

ఇంతకీ బుందేల్ ఖండ్ గురించి ఇప్పుడే ఎందుకు చర్చ మొదలైందంటే.. దీనికి బలమైన కారణమే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. దీనికి కారణం.. నాణ్యతకు మారు పేరుగా చెప్పే దానికి పూర్తి భిన్నంగా.. రోడ్ల మీదుగా గుంతలపై మండిపాటు వ్యక్తమవుతోంది. బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగానే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రాజెక్టు రోడ్లపై  పెద్ద ఎత్తున గుంతలు పడ్డాయి.

ఈ గుంతల కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాలెంపుర్ చిరియా సమీపంలో ఒక్క బుధవారంలోనే.. రెండు కార్లు.. ఒక బైక్ ప్రమాదాలకు కారణమైన పరిస్థితి. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ  ప్రాజెక్టు విషయంలో ఇలాంటి తప్పులు ఎదురవుతున్నాయన్న విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తున్నాయి. దీంతో.. బీజేపీ నేతలు ఇరుకున పడటమే కాదు.. జరిగిన దీన్ని ఎలా కవర్ చేయాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది
Tags:    

Similar News