సిట్టింగుల లెక్క‌లు మారాయ్‌.. బాబు ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌..!

Update: 2022-09-21 02:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు లెక్క‌లు వేసుకుంటున్నారు. పైగా...నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంతో ఇంతో అధైర్యంగా ఉన్న‌వారు కూడా.. ఇప్పుడుధైర్యంగా కాల‌ర్ ఎగ‌రేసుకుని తిరుగుతున్నారు. ఉన్న‌ది 19 మంది అయినా.. వీరిలోనూ చంద్ర‌బాబు, బాల‌య్య వంటి వారిని ప‌క్క‌న పెడితే.. మిగిలిన 17 మంది ఉన్నారు. వీరిలో గంటా శ్రీనివాస‌రావు ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా ఉంది. ఆయ‌న విశాఖ ఉక్కు ఉద్య‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

దీనిపై స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారో ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో గంటా ఎమ్మెల్యేనా కాదా.. అనే ది తేలాల్సి ఉంది. ఆయ‌న ప్ర‌స్తుతం అసెంబ్లీకి కూడా రావ‌డం లేదు. పోనీ.. పార్టీ త‌ర‌ఫున  అయినా.. ఆయ‌న మాట్లాడుతున్నారా? అంటే.. అది  కూడా లేదు. సో.. ఈ ప‌రిణాల‌తో ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెడితే.. ఇత‌మిత్థంగా 16మంది  ఎమ్మెల్యేలు నిక‌రంగా క‌నిపిస్తున్నారు. సో.. వీరంద‌రికి కూడా.. చంద్ర‌బాబు టికెట్లు ఇస్తామ‌ని చెప్పేశారు.

వారికి నేరుగా హామీ ఇవ్వ‌క‌పోయినా.. వైసీపీకి విసిరిన స‌వాల్‌ను బ‌ట్టి..చంద్ర‌బాబు సిట్టింగులంద‌రికీ కూ డా టికెట్లు ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఇప్పుడు సిట్టింగులు లెక్క‌లు వేసుకుం టున్నారు. త‌మ‌కు టికెట్ ఇస్తారు స‌రే.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అసంతృప్తుల‌ను ఎలా బుజ్జ‌గించాల‌నేది.. వారి ఆందోళ‌న‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కులు కూడా కొంద‌రు టికెట్ ఆశిస్తున్నారు. మ‌రికొంద‌రు.. సిట్టింగుల‌తో పొస‌గ‌క దూరంగా ఉంటున్నారు.

ఇక‌, చాలా చోట్ల టీడీపీ సిట్టింగులు సైతం.. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నార‌నేది ఒక చ‌ర్చ‌గా సాగుతోంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు సీట్లు ఇవ్వ‌డం వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆర్థికంగా కూడా.. త‌మ‌కు ఏదైనా చేయాల‌ని..వారు కోరుతున్నారు. అదేస‌మ‌యంలో పార్టీలో లోపించిన ఐక్య‌త‌ను మళ్లీ తీసుకురావాల‌ని.. చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పొత్తులు ఉన్న‌ప్ప‌టికీ..త‌మ గెలుపున‌కు ఢోకాలేద‌నే..  హామీ కూడా కోరుతున్నారు. ఇవ‌న్నీ చిత్రంగా ఉన్నా.. టీడీపీలో ప్ర‌స్తుతం హ‌ల్చ‌ల్ చేస్తున్న కామెంట్లు ప్ర‌శ్న‌లు ఇవే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News