అడివెంల హత్య : వివాహేతర సంబంధమే కారణం

Update: 2021-07-07 11:30 GMT
నల్గొండ, అర్వపల్లి మండలంలోని అడివెంల లో జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు వెల్లడించారు. డీఎస్పీ ఎస్‌. మోహన్‌ కుమార్‌ మంగళవా రం నాగారం సర్కిల్‌ కార్యాలయంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామంలో ఈనెల 2న రాత్రి 27 ఏళ్ల ఓ వ్యక్తి  దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి 4రోజుల్లో ఛేదించారు. అదేగ్రామానికి చెందిన ఇద్దరు    హత్యకు పాల్పడినట్లు చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే .. గ్రామానికి చెందిన ఓ మహిళతో గత పదేళ్ల నుంచి నిందితుడు వివాహేతర సంబంధాన్ని కొనసాగి స్తున్నాడు. అయితే ఏడాది క్రితం అతనికి వివాహం జరిగింది. 4నెలల నుంచి వివాహేతర సంబంధం కలిగిన మహిళతో నిందితుడుకి  మనస్పర్థలు వచ్చి ఆ మహిళతో దూరంగా ఉంటున్నాడు. ఆ మహిళ మృతుడితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఇది తెలిసిన నిందితుడు అతన్ని పలు మార్లు హెచ్చరించాడు. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళతో నీవెలా మళ్లీ సంబంధం పెట్టుకుంటావని ఘర్షణ పడ్డాడు. కాని అతడు ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంతో గత నెల 29న తన స్నేహితుడు తో కలిసి హత్యకు పథకం వేయగా అది ఫెయిల్ అయ్యింది. ఈ నెల 2న రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దు కాణంలో మద్యం సేవిస్తూ మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. తన స్నేహితుడు   సహకారంతో పథకం ప్రకారం దారికాచి ఉన్న కత్తితో సైదులు మెడపై నరికి హత్య చేశాడు. అ యితే శైలేందర్‌ పారిపోగా పోలీసులు వారి సెల్‌ నంబర్ల కాల్‌ డేటాను సేకరించి నిందితులను గుర్తించా రు. మంగళవారం హత్యకేసులో నిందితులైని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. 35 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న అడివెంల గ్రామం యువకుడి హత్యతో ఒక్కసారిగా గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
Tags:    

Similar News