ఢిల్లీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ: అదానీ - జీఎంఆర్ గ్రూపులకు పంట పండనుందా!
దేశరాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రబుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌లా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. స్టేషన్ ప్రాంగణంలో నాలుగు దిక్కులా విశాలమైన రోడ్లు, స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు మొత్తం ఆరు ఎంట్రీ పాయింట్లు, బయటకు వెళ్లేందుకు ఆరు గేట్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేసమయంలో స్టేషన్లో మౌలిక సదుపాయాలను భారీ ఎత్తున తీర్చిదిద్దనున్నారు. హోటళ్లు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్... ఇలా అన్నీ రైల్వే స్టేషన్‌లో అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు.. గగన తలం నుంచి చూస్తే.. ఢిల్లీ రైల్వేస్టేషన్ `~`(ఇన్ఫినిటీ) ఆకారాన్ని పోలి ఉండి.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించనుంది. ఇక, స్టేషన్లో 70, 40 మీటర్ల ఎత్తైన రెండు భవనాలు కొత్తగా నిర్మిస్తున్నారు.
ఇక, ఈ పునరుద్ధరణ పనులకు సంబంధించి టెండర్ల ఖరారు ప్రక్రియ మొదలు కానుంది. అయితే.. తొలి దశలో ఆసక్తి ఉన్న ప్రైవేటు సంస్థల నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్‌క్యూ) దరఖాస్తులను ఆహ్వానించారు. దీనిలో ప్రముఖ కంపెనీలు జీఎంఆర్, ఓమెక్స్, అదానీ రైల్వే సహా తొమ్మిది జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు దరఖాస్తు చేశాయి. అయితే.. ఈ క్రమంలో మన దేశానికి చెందిన అదానీ, జీఎంఆర్ గ్రూపులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నాయి. టెండర్లు తమకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని సమాచారం. దీనికి కారణం ఏంటి? సహజంగా.. ఇలాంటివి చాలానే జరుగుతున్నా.. ఢిల్లీ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు దక్కించుకోవడం వెనుక చాలా లబ్ది ఉందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసిన విషయాలను బట్టి.. ఢిల్లీ పునరుద్ధరణ పనులు చేపట్టే కంపెనీకి.. ఇప్పటి వరకు జరగని లబ్ధి జరగనుంది. 12 లక్షల చదరపు మీటర్ల బిల్ట్ అప్ ఏరియాలో రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయబోతున్నారు. అయితే.. దీనిలో 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని ప్రాజెక్టు చేపట్టే సంస్థకు 60 ఏళ్లపాటు రైల్వే లీజుకు ఇస్తారు. ఇదేం ఆషామాషీ విషయం కాదు.. దేశంలోనే ఢిల్లీ రైల్వే స్టేషన్ రెండో అతి పెద్దది. రోజుకు నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తారు. విదేశాల నుంచి ప్రయాణికులు రాజధానికివస్తారు. ఇక, రోజూ 400 రైళ్లు ఇక్కడికి రాకపోకలు సాగిస్తాయి.
ఈ నేపథ్యంలో 2.5 లక్షల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో కాంట్రాక్టు సంస్థలు దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, వ్యాపార కేంద్రాల వంటివి ఏర్పాటు చేసుకుంటే.. వేల కోట్ల రూపాయలను ఆర్జించే అవకాశం మెండుగా ఉంది. ఇక, ఈ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి 6,500 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. దీనిలో కాంట్రాక్టు సంస్థ 5 వేల కోట్ల రూపాయలు రైల్వే పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిగతా 1,500 కోట్ల రూపాయాలను ఆ సంస్థ తమ రియల్ ఎస్టేస్ పనుల కోసం ఖర్చు చేసుకోవచ్చు. ఇలా అనేక రూపాల్లో ఢిల్లీ రైల్వే స్టేషన్.. కాంట్రాక్టు సంస్థకు బంగారు బాతుగా మారనుంది. అందుకే అదానీ, జీఎం ఆర్ సంస్థలు ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు ప్రత్యేక ఇంట్రస్ట్ చూపుతున్నాయి. మరి ఎవరికి దక్కుతుందో చూడాలి.