ప్రపంచాన్ని గడగడ వణికించేస్తున్న మహమ్మారి కరోనా గురించి ప్రపంచానికి తెలియజేసిన ఓ మహిళా విలేఖరికి చైనా ప్రభుత్వం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఝూంగ్ ఝాన్ అనే మహిళా విలేకరి ఈ ఏడాది ఫిబ్రవరి వూహాన్ కి వెళ్లి , అక్కడి నుంచి కరోనా కేసులకు సంబంధించి పలు కథనాలు రాశారు. కరోనా ఆ ప్రాంతం నుంచే బయటపడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మరణాలకు కారణం ఎవరని ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు వేధించారని, కొంతమంది స్వతంత్ర విలేకరులను కనిపించకుండా చేశారని ఝాన్ కథనాలు రాశారని చైనీస్ హ్యూమన్ రైట్ డిఫెండర్స్ అనే స్వచ్చంద సంస్థ వెల్లడించింది.
ఈ సమయంలోనే గొడవలకి దిగుతున్నారని, సమస్యలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఝాన్ ను మేలో అరెస్ట్ చేశారు.మే 14వ తేదీ నుంచి ఝూన్ కనిపించకుండా పోయారని CHRD వెల్లడించింది. ఒక రోజు తర్వాత..ఝాన్ తమ కస్టడీలో ఉన్నాడని షాంఘై పోలీసులు వెల్లడించారు. ఇక ,మూడు నెలల నిర్భంద తర్వాత ఝాన్ ను కలిసేందుకు న్యాయవాదికి అనుమతినిచ్చింది. అయితే అరెస్టు నిరసిస్తూ జైల్లో అతను నిరహార దీక్షకు దిగారని సెప్టెంబర్ 19వ తేదీన దోషిగా నిర్ధారించామని ఝాన్ న్యాయవాదికి ఓ ఫోన్ వచ్చింది. ఝాన్ కేసులో వెలువడిన ప్రతిని పరిశీలించగా వీ చాట్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా..తప్పుడు సమాచారాన్ని అక్షరాలు, వీడియోల రూపంలో ప్రసారం చేశారని అన్న ఆరోపణలపై ఝామ్ కు శిక్ష విధించినట్లు ఉంది.
వూహాన్ లో వైరస్ కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేసినందుకు ఝాన్ ను శిక్షిస్తున్నట్లు అందులో వెల్లడించారు. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల వరకు జైలు శిక్షను విధించాలని న్యాయస్థానం సూచించింది. అంతేకాకుండా.. విదేశీ ప్రచురణ సంస్థల ఇంటర్వూ్యలకు అంగీకరించినందుకు, వూహాన్ లో వైరస్ కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు ఝాన్‌ను శిక్షిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఝాన్ తో పాటు కొంతమంది విలేకరులు కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.