బీహార్ ఎన్నికల వేళ..రాహుల్ పిక్నిక్ లో ఎంజాయ్

Update: 2020-11-16 09:10 GMT
బీహార్ ఎన్నికల్లో ఓటమిని ఆర్జేడీ తట్టుకోలేకపోతోంది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటోంది. కాంగ్రెస్ తో పొత్తు వల్లే బీహార్ లో ఓడిపోయామని ఆర్జేడీ మథనపడుతోంది. 70కు పైగా సీట్లు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ 20 కూడా గెలవలేకపోవడమే ఆర్జేడీ కూటమికి కారణంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

తాజాగా బీహార్ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిమ్లాలోని తన సోదరి ప్రియాంకగాంధీ ఇంట్లో పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ విమర్శించారు.మహాఘట్ బంధన్ కు కాంగ్రెస్ పార్టీ అడ్డుపుల్లగా మారిందన్నారు.

70 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కేవలం 19 స్థానాలు మాత్రమే గెలిచిందని ఆర్జేడీ ఆరోపించింది. ఆర్జేడీ 75 స్థానాల్లో గెలుపొందగా లెఫ్ట్ పార్టీలు కూడా మంచిపనితీరు కనబరిచాయి.

బీహార్ ఎన్నికల్లో రాహుల్ పాల్గొనలేదని.. ర్యాలీలు నిర్వహించలేదని.. ప్రియాంక గాంధీ ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదని శివానంద్ తివారీ ఆరోపించారు. ఇది బీహార్ రాష్ట్రానికే కాదు.. ఇతర రాష్ట్రాలకు వర్తిస్తుందని అన్నారు.


Tags:    

Similar News