'పుల్లారెడ్డి' ఈ పేరు చెప్పగానే నోరంతా తియ్యగా మారిపోతుంది. ఇక, పుల్లారెడ్డి స్వీట్లు తింటే.. ఆ మధురా నుభూతే వేరు. కొన్ని దశాబ్దాలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వీట్ల సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న పుల్లారెడ్డి స్వీట్లు.. అనూహ్యంగా ఇప్పుడు ఘాటెక్కాయి. ఇప్పుడు ఈ పేరు తలుచుకుంటేనే మంట నషాళానికి ఎక్కేస్తోంది. అదేంటి? ఎందుకు ? అనుకుంటున్నారా? విషయం ఇదీ..
పుల్లారెడ్డి స్వీట్స్ పేరుతో ప్రఖ్యాతి చెందిన జీ. పుల్లారెడ్డి ఇప్పుడు మన మధ్య లేరు. అయితే.. ఈ స్వీట్సుకు అధినేతగా ఆయన కుమారుడు రాఘవరెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే, ఆయన కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఇది రాష్ట్రపతి వరకు చేరింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞ ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు.
తనకు న్యాయం చేయాలని కోరడంతో పాటు ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి పర్యటనను రాఘవరెడ్డి తదితరులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తదితరులు రెండేళ్లుగా తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని వాపోయారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు.
ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు.
రాఘవరెడ్డి ఇప్పటికే తన పలుకుబడి వినియోగించి తమను బెదిరించడంతో పాటు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29న వారికి చెందిన జి.నారాయణమ్మ కళాశాలలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఇప్పుడుఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.