అమెరికాలో అత్యధికంగా మరణాల్లో కరోనా స్థానం 3వది

Update: 2022-04-23 06:30 GMT
ప్రపంచాన్ని కరోనా ‘ఒమిక్రాన్’ వేరియంట్ ఎంత అతలాకుతలం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపించి యూరప్ సహా పలు దేశాల్లో లాక్ డౌన్ కు కారణమైంది. ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్ మరో కొత్త రూపాన్ని సంతరించుకొని మరోసారి వచ్చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్.ఈ  కొత్తరకం వైరస్ కేసులు తాజాగా  అమెరికాలో విజృంభిస్తున్నాయి. కొత్త కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌లలో మూడింట ఒక వంతుకు పైగా ఇవే కేసులున్నాయి. అలెర్జీ సీజన్‌ లోలాగా అమెరికాలో ఈ వేసవి మొదట్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లక్షణాలు మరింత క్లిష్టతరంగా ఉన్నాయి.

కరోనా కల్లోలం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారి ధాటికి జనం పిట్టల్లా రాలిపోయారు. అమెరికా, యూరప్ లలో అయితే మరణ మృదంగం వినిపించింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2021లో అమెరికాలో గుండె జబ్బులు.. క్యాన్సర్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది కరోనా వల్లే.. కోవిడ్-19 మరణాలు అమెరికాలో ఆ రెండింటి తర్వాత 3వ స్థానంలో ఉన్నాయి.

2020 నుండి 2021లో మొత్తం  మరణాల రేటు దాదాపు 1 శాతం పెరిగిందని శుక్రవారం విడుదల చేసిన నివేదిక చూపించింది. సీడీసీ ప్రకారం.. దేశంలో మొత్తం మరణాల రేటు బాగా పెరిగిందని.. ఇందులో అమెరికన్ ఇండియన్ లేదా అలాస్కాన్ లు, స్థానిక హిస్పానిక్ , నల్లజాతీయులు, ఆఫ్రికన్-అమెరికన్ ప్రజలలో అత్యధికంగా మరణించిన వారిలో ఉన్నారు.

గుండె జబ్బులు మరియు క్యాన్సర్ తర్వాత అత్యధిక మరణాలకు కోవిడ్ -19 మూడవ ప్రధాన కారణంగా నిలిచిందని అమెరికా సర్కార్ సంస్థ నివేదించింది. ఈ నివేదిక 2021కి సంబంధించిన తాత్కాలిక అమెరికా మరణాల డేటా. మరణాలకి సంబంధించిన అన్ని కారణాల మరణాల రేటు .. కోవిడ్-19కి సంబంధించిన మరణాల పోలికతో సీడీసీ ఒక నివేదికలో విడుదలలో తెలిపింది.

ఈ మరణాల రేటును తగ్గించడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని నివేదిక ఎత్తి చూపింది.
Tags:    

Similar News