మూడేళ్లయినా కరోనా వైరస్ గుట్టు తెలియట్లేదు.. ఇలా అయితే కష్టమేనట!

Update: 2022-04-30 12:45 GMT
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గుట్టు మూడేళ్లయినా శాస్త్రవేత్తలకే అంతు చిక్కడం లేదు. ఇంత కాలం అవుతున్న తన రూపు మార్చుకుంటూ.. కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి గురించి అర్థం కావడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో కొత్త వేవ్ లతో ఎలా వస్తున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీటికి తోడు లాంగ్ కొవిడ్ ఎఫెక్ట్ పై అధ్యయనం చేస్తున్నా... కరోనా గుట్టురట్టవడం లేదని చెబుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వివిధ రకాలుగా ప్రవర్తిస్తోందట.

వ్యాధి ప్రాబల్యం, మరణాలు ఎక్కువగా పెద్ద వయసు వారిలో ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నివేదికల ఫలితాలు ఒకే విధంగా లేవన్నారు. చాలా దేశాల్లో ఒకే విధమైన పరీక్షా పద్ధతులు, జన్యు క్రమం విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయని సౌమ్య స్వామి నాథన్ అన్నారు.

లాంగ్ కొవిడ్ కేవలం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కల్గించడమే కాకుండా ఉత్తర అవయవాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ఇతర శ్వాస కోశ వైరస్ లతో పోలిస్తే... కరోనా వైరస్ విభిన్నంగా ఉందని ఆమె అన్నారు.

కరోనాలో అన్ని వేరియంట్లను ఎదుర్కునేందుకు ఒకే రకమైన టీకా రావాల్సిన అవసరం ఎందో ఉందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయ పడింది. వచ్చే రెండేళ్లలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే పాక్ కరోనా వ్యాక్సిన్ పై ఆశాజనకంగా ఉన్నట్లు సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.

కరోనా టీకాల వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ.. కరోనా పూర్తి గుట్టు రట్టు అయితే... రాబోయే కాలంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరిస్తున్నారు. అయితే అప్పటి వరకు మాత్రం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండి కరోనా రెండు డోసుల టీకాలతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు.

అలాగే కరోనా టీకానే ప్రజలందరికీ శ్రీరామరక్ష అని పేర్కొంటున్నారు. టీకాలు తీసుకున్న వారు పెద్దగా భయపడాల్సిన అవసరమేం లేదని.. కాకపోతే ఎక్కడికైనా వెళ్తే మాత్రం కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News