సలహాదారులకు ఇప్పటివరకు పెట్టిన ఖర్చు అంతేనట

Update: 2023-01-07 04:48 GMT
ప్రభుత్వం అన్న తర్వాత ఖర్చులు మామూలే. నచ్చి.. మెచ్చి.. అఖండ మెజార్టీతో అధికార పీఠం మీద కూర్చోబెట్టిన ప్రజల రుణం తీర్చుకోవటం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ సలహాదారుల్ని ఏర్పాటు చేసుకునే జగన్ ప్రభుత్వం.. తాను పవర్లోకి వచ్చిన కాలానికి తాను ఏర్పాటు చేసిన సలహాదారుల కోసం పెట్టిన ఖర్చుపై ఆసక్తికర లెక్కలు వినిపిస్తున్నాయి.

పాలనా రథాన్ని మరింత సులువుగా దౌడు తీయించేందుకు వీలుగా సలహాదారుల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు నియమించిన వారికి మిన్నగా సలహాదారుల్ని భారీగా నియమించుకోవటం అలవాటుగా మారింది.

తనను నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆ మాత్రం సేవ చేయకపోతే ఎలా? అందుకేనేమో.. పవర్లోకి వచ్చిన నాటినుంచి తన మనసుకు నచ్చిన ప్రతి ఒక్కరిన ప్రభుత్వ సలహాదారు పోస్టుల్లో పెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సలహాదారుల పోస్టులతో నింపేస్తున్న వైనంపై న్యాయస్థానాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ.. ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది జగన్ సర్కారు.

న్యాయస్థానం మాటల్ని విన్న వేళలో.. ఆ మాటల్లో న్యాయం ఎంత? అన్న లెక్క వేసుకునే వారికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకు భిన్నంగా కోర్టులో తనకు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యల్ని ఇగ్మోర్ చేసే అలవాటు ఈ మద్యన ఎక్కువైందన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.తాజాగా సలహాదారుల మీద హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని ఒక పక్కన పెట్టి.. జగన్ సర్కారు కొలువు తీరిన తర్వాత ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు చేసిందన్న విషయంపై లెక్క చూస్తే.. కళ్లు తిరిగక మానదు. ఎందుకంటే.. మొత్తం 65 మంది వరకు ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్నారు.

వీరికి చెల్లించాల్సిన జీతాలు.. ఇతరాలు కలుపుకొని ఖర్చు ఎంతో తెలుసా? జస్టు.. రూ.145 కోట్లుగా చెబుతున్నారు. ఇంత భారీగా సలహాదారులకు చెల్లింపులు జరిపే వేళ.. వారి కారణంగా రాష్ట్రానికి కానీ సర్కారుకు కానీ జరుగుతున్న మేలు ఎంతన్నది ఒక ప్రశ్న. ప్రయోజనం కంటే కూడా పోట్లే ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. సలహాదారుల కోసం ఇంత భారీగా ఖర్చులు చేయటం ఎంతవరకుసబబు? అన్నది ప్రశ్నగా మారింది.

ఇలాంటి ప్రశ్నల్ని వినటం.. వాటికి సమాధానం చెప్పటం లాంటివి జగన్ సర్కారు చేయదన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు. అయినా.. మూడేళ్ల వ్యవధిలో రూ.145 కోట్లు సలహాదారుల ఖర్చుకే ఇంతలా హడావుడి ఎందుకు? ఖర్చు చేసింది ఏమైనా రూ.1145 కోట్లా? చెప్పండి?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News