అత్యంత ఖరీదైన ఫోన్లను అమ్మే కంపెనీగా యాపిల్ సుపరిచితం. మార్కెట్లో మరే మొబైల్ కంపెనీ కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే ఫోన్ మొదలు ఖరీదైన ఫోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. యాపిల్ సంస్థ లెక్కనే వేరుగా ఉంటుంది. ఆ దేశం తయారు చేసే ఫోన్ ప్రతిది ఖరీదైనది. ఇక.. లేటెస్టు మోడళ్ల విషయానికి వస్తే.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి వారు సైతం ఒక మారు ఆలోచించుకునేలా చేసేంత ధర ఉంటాయి. ఇంత ధర పెట్టి కొనే కస్టమర్లకు యాపిల్ సంస్థ చెబుతున్న కొత్త లెక్క తిక్కరేగేలా మారింది.
పర్యావరణ సంరక్షణలో భాగంగా.. తమ కొత్త ఫోన్లను కొనే వారికి అడాప్టర్ (ఛార్జర్) ఇవ్వటాన్ని నిలిపేసింది. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్నిదేశాల్లో అమలు చేస్తోంది యాపిల్ సంస్థ. అడాప్టర్ ఇవ్వకుండా ఫోన్లను అమ్మే దేశాల జాబితాలో బ్రెజిల్ కూడా ఉంది. యాపిల్ సంస్థ అనుసరిస్తున్న విధానంతో విభేదిస్తున్న బ్రెజిల్ ప్రభుత్వం.. తమ దేశంలో ఐ ఫోన్ అమ్మకాలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తే తప్పించి అమ్మకాలకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేస్తోంది.
యాపిల్ తీసుకున్న నిర్ణయంతో మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థలైన శాంసంగ్.. ఒప్పో.. వన్ ప్లస్ సంస్థలు సైతం ఛార్జింగ్ అడాప్టర్లను ఇవ్వని పరిస్థితి. మొబైల్ సంస్థల తీరుతో వినియోగదారుల మీద అదనపు భారం పడేలా చేస్తున్నారన్నది ప్రధాన ఫిర్యాదు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్రెజిల్ ప్రభుత్వం యాపిల్ కంపెనీ మీద పలుమార్లు భారీ జరిమానా విధించింది. అయినప్పటికీ యాపిల్ సంస్థ తన ఆలోచనను మార్చుకోపోవటంతో.. చివరి అస్త్రంలో బ్యాన్ నిర్ణయాన్ని తీసుకుంది.
'ఆపరేషన్ డిశ్చార్జ్' పేరుతో దేశ వ్యాప్తంగా ఐఫోన్లు అమ్మే యాపిల్ స్టోర్లతో పాటు.. రిటైలర్ల వద్ద ఉండే ఐఫోన్ మోడల్స్ అమ్మకాల్నిసీజ్ చేసింది. దీంతో.. షాక్ తగిలిన యాపిల్ సంస్థ.. ఐఫోన్లను అమ్మటానికి అనుమతి ఇవ్వాలని బ్రెజిల్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే.. తమ దేశంలో అమ్మే ఫోన్లలో అడాప్టర్లు లేకుండా ఐఫోన్లు అమ్మకాలకు తాము ఒప్పుకోమని స్పష్టం చేసింది. అడాప్టర్ అన్నది ఫోన్ పని చేసేందుకు తప్పనిసరి అని పేర్కొంది.
మరోవైపు ఛార్జింగ్ అడాప్టర్లను ఫోన్ కొన్న ప్రతిసారీ ఇవ్వటం ఆపేయటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల్ని తగ్గించొచ్చన్న చెత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు.
అలాంటప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక ఫోన్ ను కనీసం మూడేళ్లు వాడాలని.. ఆ తర్వాత కొత్త ఫోన్ కొనేందుకు అనుమతులు ఇస్తామని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు చెబితే.. ఈ మొబైల్ ఫోన్ల కంపెనీలు.. ఇలాంటి శ్రీరంగ నీతులు చెబుతాయా? ఫోన్లు అమ్ముకునేటోడు తన లాభాల్ని పెంచుకోవటానికి పర్యావరణం మాటను వాడేయటానికి మించిన కామెడీ మరేం ఉంటుంది చెప్పండి?ఐఫోన్ల అమ్మకాల విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైనదని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.