నగ్నంగా ఆ భార్యాభర్తలు .. బట్టలు వేసుకోవడం ఎప్పుడో మర్చిపోయారట !

Update: 2021-08-09 06:54 GMT
సాధారణంగా ఎవరైనా కూడా సమాజంలో భాద్యత గల పౌరుడిగా జీవించాలంటే సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటిని ఇష్టం ఉన్నా లేకున్నా కూడా పాటించాల్సిందే. నచ్చినా .. నచ్చకపోయినా సమాజంలో మనం కూడా భాగమే కాబట్టి తప్పక పాటించాలి. ముఖ్యంగా బట్టలు వేసుకోవడం విషయంలో మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కట్టుబాటు ఉంది. అయితే ,  ఓ జంట మాత్రం మేము ప్రకృతి ప్రేమికులం కాబట్టి మాకు బట్టలు అవసరం లేదు అని చెప్తున్నారు. అసలు ఈ వింత జంట గురించి పూర్తిగా తెలుసుకుంటే షాక్ అవుతారు. ఎందుకంటే వారు విద్యుత్ వినియోగించరు, పైప్‌ల ద్వారా, కుళాయిల ద్వారా వచ్చే నీటిని వాడరు. అంతేకాదు.. వీరసలు బట్టలే వేసుకోరు.

ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పాత వాహనంలో ప్రకృతి మధ్య జీవనం సాగిస్తున్నారు. వీరు నగరంలోకి వెళ్లాల్సి వచ్చినా బట్టలు వేసుకోరు. నగ్నంగానే వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తారు. ఇంగ్లండ్‌ లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్, హెలెన్ దంపతుల జీవన విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.  జాన్, హెలన్ 2011లో పురాతన పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2006 నుంచి నేచరిస్ట్‌గా జీవనం సాగిస్తున్న హెలెన్‌ను ఇష్టపడిన జాన్.. 2011 నుంచి తను కూడా అలా మారిపోయారు.

ఈ  ఇద్దరూ 24 గంటలూ బట్టలు వేసుకోకుండానే గడుపుతారు. విద్యుత్‌ను వాడరు. సహాజంగా ప్రకృతిలో లభించే నీటిని తప్ప, వీరు  కుళాయిల ద్వారా వచ్చే నీటిని ఏ ఒక్క పనికి కూడా వాడరు. వీరిది పూర్తిగా ప్రకృతితో మమేకమైన జీవనం. నగరంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు కూడా వీరు నగ్నంగానే వెళ్తారు. మాది ఓ ప్రత్యేకమైన జీవన విధానం. అందరూ అనుసరించదగినది కాదు. ఇలా జీవించమని మేము ఎవరినీ బలవంతం కూడా చేయము. మాకు ఇలా బతకాలని అనిపించింది. మేం న్యూడిస్ట్‌లం కాదు.. నేచురలిస్ట్‌లం. రెండు తువ్వాళ్లు తప్ప మా దగ్గరం ఇంకెలాంటి దుస్తులూ ఉండవు. విద్యుత్తును వాడం. మేం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి.. జంతువులు, కీటకాల నుంచి ప్రమాదం లేకుండా ఉండడం కోసం వ్యాన్‌లో ఉంటున్నామని హెలెన్ తెలిపారు.
Tags:    

Similar News