వైఫ్ శ్వాప్ పెరిగిందా? ఈ స్టోరీ చ‌ద‌వండి

Update: 2021-11-10 11:30 GMT
వైఫ్ శ్వాప్‌.. ఇది ఎక్క‌డా వినిపించిన‌ట్టు లేదు క‌దా! పైగా మ‌న దేశం లో ఎక్క‌డా ఇలాంటి సంస్కృతి.. క‌నీ సం మాట కూడా వినేందుకు.. విని పించేందుకు కూడా ఎవ‌రూ సాహ‌సించే ప‌నిచేయ‌రు. భార్య‌ల‌ ను ఒక‌రి నొ క‌రు మార్చుకునే సంస్కృతి కొన్ని ప‌శ్చిమ దేశాల్లో ఉంది. మ‌న దేశం లో ఇలాంటి మాట కాదు.. క‌నీసం.. ఇలాంటి ఆలోచ‌న కూడా చేసే సాహ‌సం.. ధైర్యం ఎవ‌రూ చేయ‌రు. ఒక భార్య‌ను మ‌రొక‌రు కాంక్షించ‌డాన్ని ఘోరం గా భావిస్తారు. అంతేకాదు.. ఇలాంటి ఆలోచ‌న‌లు రాకూడ‌దనుకున్నారో.. ఏమో.. మన పెద్ద‌లు.. ప‌ర‌స్త్రీని త‌ల్లిగా చూడ‌మ‌ని చెప్పారు.

విష సంస్కృతి దిశ‌గా!

పోనీ.. అలా కాక‌పోయినా.. వాడుక‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌కారం.. ఏ భార్య అయినా.. త‌న భ‌ర్త తాలూకు స్నేహితుల‌ను అన్న‌య్యా! అని పిల‌వ‌డం.. కుదిరితే రాఖీలు కూడా క‌ట్ట‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే.. ఇప్పుడు.. ఇంత ప‌విత్ర‌మైన సంప్ర‌దాయం.. మ‌టుమాయం అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఒక‌రి భార్య‌ను మ‌రొక‌రు మార్చుకునే ప‌రిస్థితి, ఒక అత్యంత ఘోర‌మైన సంప్ర‌దాయం.. తెర‌మీదికి వ‌స్తోంది. ఈ విష‌యంలో.. భార్య‌ల‌ కు ఇష్టం లేకున్నా.. వ్యాపార అవ‌స‌రాలుకావొచ్చు.. స్టేట‌స్ కావొచ్చు.. ఏదేమైనా.. ఇలాంటి అత్యంత దారుణ‌మైన సంస్కృతి పెరుగుతోంద‌నేదివాస్త‌వం.

బెంగ‌ళూరు లో ఏం జ‌రిగిందంటే!

బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెండో భార్య చేతిలో కోటీశ్వరుడైన రియల్టర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (46)అనే వ్యాపారిని అతని రెండో భార్య అయిన నేత్ర అతిదారుణంగా చంపేసి, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వృత్తిరీత్యా బ్యూటీషీయన్‌ అయిన నేత్ర తానీ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసులకు చెప్పింది.

రియల్టర్ పలార్ స్వామి ఉత్తర బెంగళూరు తాలూకాలో లేఔట్లు వేసి అనతికాలంలోనే కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక్కసారే విపరీతమైన డబ్బులు వచ్చేసరికి స్వామికి కొత్త కోరికలూ పుట్టుకొచ్చాయి. అప్పటికే అతనికి పెళ్లై భార్యా, పిల్లలు ఉన్నా, మాదనాయకనహళ్లికి చెందిన బ్యుటీషియన్ నేత్రతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరేళ్ల కిందట వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. పలార్ స్వామి ఆమె పేరు మీద హారో క్యాతనహళ్లిలో రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు.

ఇలా అడ్డం తిరిగింది!

ఇద్దరు భార్యలను చేసుకున్నా, పలార్ స్వామిలో కామవాంఛ తీరలేదు. తనతోపాటు వ్యాపారం చేసేవారి భార్యలనూ కోరుకున్నాడు. అవతలివాళ్లూ ఇదే బాపతు కావడంతో వైఫ్ శ్వాప్ నెట్వర్క్ ఏర్పడింది. పరాయివాడి భార్యను తాను పొందాలంటే, తన భార్యను వేరే వ్యక్తి దగ్గరికి పంపాల్సి ఉండటంతో.. ఆ పని చేయాల్సిందిగా నేత్రపై స్వామి ఒత్తిడి పెట్టాడు.. అయితే.. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అప్ప‌టి నుంచి ఆమెను తీవ్రంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇద్దరిమధ్యా మాటామాటా పెరిగి తోపులాట దాకా వెళ్లింది. ఆవేశంలో రెండో భార్య నేత్ర.. పలార్‌స్వామిని రాడ్‌తో కొట్ట‌డంతో ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

ఇది నిజ‌మేనా?

ప‌లార్ స్వామి.. నిజంగానే ఇలా చేశాడా? అనేది ప్ర‌స్తుతం ప‌రిశోధ‌న‌లో తేలాల్సిన అంశం. అయితే.. ఇప్ప టి వ‌ర‌కు దేశంలో ఎక్క‌డా ఇలాంటి కేసు వెలుగు చూడ‌క‌పోవ‌డం.. బెంగళూరులో ఇటీవ‌ల ఇలాంటి విదేశీ సంస్కృతులు విచ్చ‌ల‌విడిగా దూసుకువ‌స్తుండ‌డం.. వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో అనుమానించా ల్సిన అవ‌స‌రం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. మ‌రి ఏం తేలుతుందో చూడాలి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. దేశ సంస్కృతి... ప‌రువు మ‌ర్యాద‌లు.. తుడిచిపెట్టుకుపోయే దుష్ట సంప్ర‌దాయానికి తెర‌దీసిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News