సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది...మాహా అంటే...రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 80 లక్షల కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. ఇది మా కరెంట్ బిల్లేనా అంటూ గుండె పట్టుకున్నాడు. మొత్తంగా ఇప్పుడు సామాన్యులని వైరస్ కంటే కరెంట్ బిల్లులు ఎక్కువగా భయపెడుతున్నాయి.
లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడుతున్న సమయంలో విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. ప్రస్తుతం మీటరు రీడింగ్ ప్రకారం బిల్లులు ఇవ్వడంతో రెట్టింపు చార్జీలు వస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల పనులులేక అష్టకష్టాలు పడుతున్న ప్రజలకి ఈ విద్యుత్ బిల్లులు మోత మోగిస్తున్నాయి. రెండు నెలల రీడింగ్ ఒకేసారి తీయడంతో స్లాబ్ మారి చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, మధ్యప్రదేశ్‌లో ఓ సామాన్యుడి ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు రావడంతో షాకయ్యారు. సింగ్రౌలి జిల్లాలోని బైఢన్ గ్రామంలోని ఓ ఇంటికి రూ.80 లక్షల కోట్లు బిల్లు వచ్చింది. దీనిపై సదరు యజమాని ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయాడు. అధికారులు చేసిన తప్పిదంతోనే ఇలా జరిగిందని, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందాడు. ఛార్జీలు పెంచక పోయినా.. ఏ,బి,సి స్లాబులతో బిల్లులు రెట్టింపుగా కనిపిస్తున్నాయి.