ఆప్ఘనిస్థాన్ దేశం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి తాలిబన్లకు మరో నెల రోజులు మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఇపుడు దేశాధికారం తాలిబన్ల చేతిలోకి వచ్చేసినా ముఖ్యమైన పంజషీర్ ప్రావిన్స్ మాత్రం వీళ్ళకు కొరకరాని కొయ్యలాగే మిగిలిపోతుంది. 20 ఏళ్ల క్రితం కూడా యావత్ దేశం తాలిబన్ల వశమైనా పంజ్ షీర్లో మాత్రం తాలిబన్ల అధికారం చెల్లలేదు. ఇపుడు కూడా అచ్చంగా అలాంటి పరిస్దితే పునరావృమవుతున్నట్లే కనబడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి పంజ్ షీర్ ప్రావిన్సును తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తాలిబన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
పంజ్ షీర్ ప్రావిన్స్ లోకి ప్రవేశించే మార్గాల్లో తాలిబన్ల సైన్యాలు కాచుక్కుర్చున్నాయి. రాత్రనకా పగలనకా యుద్ధం జరుగుతూనే ఉంది. అయినా తాలిబన్లు పంజ్ షీర్లోకి ప్రవేశించలేకపోతున్నారు. అయితే తాజా పరిణామాల్లో పంజ్ షీర్ తమ వశమైపోయిందని తాలిబన్లు ప్రకటిస్తున్నా అందుకు ఆధారాలేమీ కనబడటం లేదు. ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయంపై తాము జెండా ఎగరేశామని, అమ్రుల్లా సలేహ్ ఇంటిని కూల్చేశామని తాలిబన్లు ప్రకటించుకుంటున్నారంతే. దీన్ని పంజ్ షీర్లు ధృవీకరించకపోవటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో తాము లొంగిపోలేదని పంజ్ షీర్ చీఫ్ మసూడ్ ప్రకటించారు.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే పంజ్ షీర్ ను వశం చేసుకోవడానికి తాలిబన్లకు ఈ నెలాఖరుకు మాత్రమే గడువుందట. కారణం ఏమిటంటే అక్టోబర్ నెలలో మంచు, చలి పెరిగిపోతుంది. పంజ్ షీర్ ప్రావిన్సు మొత్తం కొండలు, అడవులు, పర్వతాలు, లోయలతో నిండిపోయుంటుంది. కాబట్టి సహజంగానే ఈ ప్రాంతంలో విపరీతమైన చలి, మంచు కురుస్తుంటుంది. పంజ్ షీర్లు తప్ప ఇతర ప్రాంతాల వాళ్ళెవరు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమంటున్నారు.
ఇపుడే పంజ్ షీర్లను తట్టుకుని ప్రావిన్సులోకి తాలిబన్లు అడుగుపెట్టలేకపోతున్నారు. వీళ్ళని కాదని లోపలకు చొచ్చుకుపోయిన తాలిబన్లు 700 మందిని చంపేశారని, మరో వెయ్యి మందిని పంజ్ షీర్లు పట్టుకున్నారంటు రష్యా మీడియా స్పుత్నిక్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడే తాలిబన్లకు ఇంత ఇబ్బందులు ఎదురవుతుంటే ఇక వాతావరణం మారిపోయిన తర్వాత అసలా ప్రాంతంలోనే ఉండలేరు. సెప్టెంబర్ లోపు పంజ్ షీర్ ను స్వాధీనం చేసుకోలేకపోతే మళ్ళీ ఐదారు మాసాల వరకు సాధ్యం కాదట.
పంజ్ షీర్లు-తాలిబన్ల యుధ్ధానికి ఐదారు మాసాలు గడువు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ గడువులోగా పంజ్ షీర్లు పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే పంజ్ షీర్లకు తజకిస్ధాన్ నూరుశాతం మద్దతిస్తోంది. తమకు మద్దతుగా నిలబడితే తాలిబన్ల పీడను ఆఫ్ఘనిస్ధాన్ కు వదిలించేస్తామని పంజ్ షీర్ నేత మసూద్ చెబుతున్నారు. ఈయనకు అనుకూలంగా కొన్నిదేశాలు స్పందించినా చాలు తాలిబన్ల పని అయిపోయినట్లే. మరి ఈనెలలోగా తాలిబన్లు పంజ్ షీర్ ప్రావిన్సును ఏమి చేయగలరో చూడాలి.