ఫేస్ బుక్ హెడ్డాఫీసులో విష‌వాయువు?

Update: 2019-07-02 09:03 GMT
ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ ప్ర‌ధాన కార్యాల‌యంపై విష వాయువుతో దాడికి ప్ర‌య‌త్నించారా?  భారీ కుట్ర‌కు ప్ర‌య‌త్నించారా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికే ప్ర‌య‌త్నం చేస్తే.. ప్రాథ‌మికంగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం సిలికాన్ వ్యాలీలోని ఫేస్ బుక్ కు చెందిన కార్యాల‌యంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన విష వాయువును గుర్తించారు.

ఇద్ద‌రు ఉద్యోగులు ఈ విష వాయువు బారిన ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. కంపెనీకి వ‌చ్చిన ఒక పార్శిల్ కార‌ణంగా ఇది చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన విష వాయువునుసారిన్ గా గుర్తించారు. 1995లో జ‌పాన్ లోని ఆరు రైళ్ల‌లో సారిన్ విష వాయువును వ‌ద‌లటం కార‌ణంగా 13 మంది మృత్యువాత ప‌డ్డారు.

కంపెనీకి వ‌చ్చిన ఒక పార్శిల్ ద్వారా ఈ విష వాయువు వ్యాప్తి చెందిన‌ట్లుగా అనుమానించిన వెంట‌నే.. స‌ద‌రు కార్యాల‌యంతో పాటు మ‌రో రెండు ఆఫీసుల‌ను కూడా ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ఖాళీ చేయించారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఎఫ్ బీ ఆఫీసుకు చేరుకొని త‌నిఖీలు చేస్తున్నారు. పార్శిల్ తాకిన ఇద్ద‌రు ఉద్యోగులు తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌టంతో అనుమానించి.. భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ల్ని అలెర్ట్ చేశారు.

పోలీసుల‌తో పాటు ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అధికారులుసైతం ఈ ఉదంతంపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ విష‌వాయువు మ‌నిషి నాడీ వ్య‌వ‌స్థ మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా మూడు కార్యాల‌యాల్లోని ఉద్యోగుల్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌కు పంపేశారు. ఈ విష వాయువు వెనుక ఉన్న కుట్ర ఏమిట‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.
Tags:    

Similar News