ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వీలుగా సిద్ధం చేసిన టీకాల్లో ఒకటి సీరమ్ సంస్థ సిద్ధం చేసిన కోవిషీల్డ్. దీన్ని వినియోగించటం ద్వారా అనూహ్యరీతిలో అనారోగ్యానికి గురి కావటం ద్వారా డెంటిస్టు మరణించిందన్న ఆరోపణలు ఉన్నాయి. రిపోర్టు కాని ఇలాంటి ఆరోపణలు ఉన్నా.. రిపోర్టు అయి.. న్యాయపోరాటం చేస్తున్న ఈ ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కుమార్తె కోవిషీల్డ్ కారణంగా మరణించినట్లుగా పేర్కొంటూ.. తమకు న్యాయం చేయాల్సిందని కోరారు.
ఇందులో భాగంగా సీరమ్ ఇన్ స్టిట్యూట్కు.. బిల్ గేట్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు తమ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందన్నది చూస్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన దిలీప్ లూనావత్ కుమార్తె స్నేహాల్ (32) డెంటిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నాసిక్ లోని ఎస్ఎంబీటీ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో సీనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆమె 2021 జనవరి 28న కోవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను తొలుత వైద్యులు.. ఆరోగ్య కార్యకర్తలకు వేసిన సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే ఆమె రెండు డోసుల్ని వేయించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి మూడున ఆమెకు తలనొప్పి మొదలైంది. ఆ సమయంలో ఆమె గుర్గావ్ లో నిర్వహిస్తున్న వర్కుషాపులోఉన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. చికిత్స కోసం రూ.14లక్షలు ఖర్చు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మెదడులో రక్తస్రావం.. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోవటంతో 2021 మార్చి ఒకటిన ఆమె మరణించారు. కోవీషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట కారణంగానే తన కుమార్తె మరణించినట్లుగా స్నేహాల్ తండ్రితో పాటు ఆమె సోదరుడు వాదిస్తున్నారు. దీనికి తగ్గట్లే వారు తమ వాదనను సీరమ్ సంస్థకు లేఖ రాశారు. నిజానికి ఈ లేఖను స్నేహాల్ ఆసుపత్రిలో ఉండగానే రాశారు. అయితే.. ఆమె అనారోగ్యానికి వ్యాక్సిన్ కు లింకులేదని సీరమ్ సంస్థ స్పష్టం చేసింది.
దీంతో.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే ఏఈఎఫ్ఐ కమిటీ ముందుకు తీసుకెళ్లారు. సదరు కమిటీ 2021 అక్టోబరు 2న ఒక నివేదికను వెల్లడించింది. అందులో స్నేహాల్ మరణం.. కోవీషీల్డ్ సైడ్ ఎఫెక్టు కారణమనే తేల్చింది.
ఈ నేపథ్యంలో ఆయన బాంబే హైకోర్టుకు న్యాయం కోసం ఆశ్రయించారు. సీరమ్ సంస్థతో పాటు బిల్ గేట్స్ రూ.వెయ్యి కోట్ల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని.. అదే సమయంలో ఇంకెవరికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే తామీ పిటిషన్ వేసినట్లుగా వారు చెబుతున్నారు. మరి.. బాంబే హైకోర్టు ఏమని తీర్పును ఇస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.