పెద్దగా ప్రచారం లేకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చి దుమ్ము రేపుతుంటాయి కొన్ని షేర్లు. భారీ అంచనాలు లేకుండా వచ్చే ఈ షేర్లు.. లిస్టింగ్ మొదలైన తర్వాత తమ ప్రతాపాన్నిరియల్ టైంలో చూపిస్తుంటాయి. అలాంటి సర్ ప్రైజ్ ఇస్తోంది ‘డెలివరీ’ షేరు. కొద్ది వారాల క్రితమే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ.. అతి తక్కువ వ్యవధిలోనే అత్యంత విలువైన తొలి 100 కంపెనీల జాబితాలో చేరటం విశేషం. అంతేకాదు.. తన జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గడిచిన ఐదు వారాల్లో ఈ కంపెనీ స్టాక్ 44 శాతానికి పైగా లాభపడింది. లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ డెలివరీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ మే 24న మార్కెట్లోకి లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.487తో మొదలైనప్పటికి.. మొదటి కొద్ది వారాలు ఎదురుదెబ్బలు తప్పలేదు. సంస్థ మీద పెద్దగా అంచనాలు లేకపోవటంతో ఇలాంటి పరిస్థితి. అయితే.. కొన్ని షేర్లు మార్కెట్ లో ఒక్కసారిగా వెలుగులోని రావటం.. దూసుకెళ్లటం తెలిసిందే. డెలివరీ షేరు పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పాలి.
లిస్టైన వెంటనే రూ.536 వరకు షేరు ధర వెళ్లినప్పటికి.. రెండు రోజులకే రూ.499కు పడింది. అయినప్పటికీ లిస్టైన మొత్తంతో పోలిస్తే లాభమే నమోదు చేసింది. అలా పైకి.. కిందకు పడిన ఈ షేరు జూన్ 17 -19 మధ్యలో లిస్టైన మొత్తం కంటే తక్కువకు జారింది. రోజు వ్యవధిలోనే కోలుకున్న ఈ షేరు రూ.513కు దూసుకెళ్లటం.. అది మొదలు మళ్లీ తగ్గకుండా రోజురోజుకీ దూసుకెళుతోంది. తాజాగా జీవిత కాల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే రూ.50,657 కోట్లతో 95వ స్థానంలో ఉంది.
లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ను అందిస్తున్న ఈ సంస్థ విస్తరణ.. సామర్థ్యం పెంపునకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు చెరబుతున్నారు. పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరించటం ద్వారా వ్యయాలు దిగి రావటంతో పాటు.. డెలివరీ సమయం కూడా తగ్గుతతుందని భావిస్తున్నారు. భివాండీ.. బెంగళూరులో తమ మౌలిక సదుపాయాల్ని మరింతగా విస్తరించనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాల్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
2023 నాటికి ఇప్పుడు చేపడుతున్న అంశాలన్ని అందుబాటులోకి వస్తాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే.. షేర్ ధర కూడా అంతకంతకూ దూసుకెళుతున్న పరిస్థితి. మొత్తంగా షేర్ మార్కెట్ లో ఈ షేరు వ్యవహారం ఆసక్తికరంగానే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేస్తుందని చెప్పాలి.
ఇదంతా చెబుతున్నాం కాబట్టి.. ఈ షేరును కొనమని రికమండ్ చేస్తున్నామన్న భావనకు అస్సలు గురి కావొద్దు. మీరు ఈ షేరును కొనటం.. కొనకపోవటం మీ చేతుల్లో ఉంది. మేం కొనమని చెప్పట్లేదు.. వద్దని చెప్పట్లేదు. కేవలం.. మార్కెట్ పరిశీలనలో భాగంగానే ఈ సమాచారాన్ని అందించామన్న విషయాన్ని మర్చిపోవద్దు సుమా.