భారత్ గురించి 1835 లో బిట్రీష్ ఎంపీ చెప్పిన కఠిన నిజాలు

Update: 2020-01-03 05:20 GMT
2020 భారతదేశం.. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా పోని అష్టదారిద్ర్యం.. ఎక్కడ చూసినా పేదరికం.. బిక్షగాళ్లు.. పేదరికానికి పర్యాయ పదంగా ఉంటోంది. ఉల్లి కోసం కొట్టుకుంటున్న పరిస్థితి.. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాలు పోయి అందరూ రోడ్డునపడుతున్నారు. తినడానికి తిండి లేని వారు ఎందరో ఉన్నారు..

1336-1646... అది విజయనగర సామ్రాజ్యం ఏలిన కాలం.. రాయల వారు ఏలుతున్న కాలంలో ముత్యాలు, వజ్రాలు సంతలో పోసి అమ్మేవారట.. ఇక ఆ తర్వాత కాలంలోనూ కులవృత్తులు, వ్యవసాయం సహా భారత దేశం సుభిక్షంగా ఉండేదట.. ఎవరి పని వారు చేస్తూ ఆర్థికంగా గొప్పగా విలసిల్లిన దేశం మనది..

మరి 1646 తర్వాత సంపన్న దేశంగా ఉన్న భారతదేశం ఎందుకు ఈ స్థితికి దిగజారడానికి కారణం దండయాత్రలు.. ముస్లిం చక్రవర్తులు ఆ తర్వాత బ్రిటీషర్ల రాకతో భారత్ ప్రభ కోల్పోయింది. భారతదేశం దోపిడీకి గురైంది. ఉవ్వెత్తున ఎగిసిన దారిద్ర్యం లేని భారతావని ఇలా ఎందుకు తయారైంది.. అంటే బ్రిటీష్ వారు మన దేశం లోకి అడుగు పెట్టాకే దరిద్రం తరుముకొచ్చింది. వారు మనల్ని దోచుకొని ఇక్కడిదంతా కొల్లగొట్టి తీసుకు పోవడం తో మన సంపద కరిగి కులవృత్తులు నాశన మై పేదరికం తాండవించింది. భారత్ ను దోపిడీ చేయడానికి బ్రిటీషర్లు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు.. తాజాగా 1835లో బయట పడ్డ ఓ బ్రిటీష్ ఎంపీ ప్రసంగం ప్రతి ఇప్పుడు దేశ ఖ్యాతిని ఇనుమడింప చేస్తోంది..

బ్రిటీష్ వాళ్లు భారత్ లోకి రావడానికి ముందు ఇక్కడ దోచుకోవడానికి అనువైన దేశమా అని వాళ్ల ఎంపీలను ఇండియాలో పర్యటింప చేశారు. ఆ కోవలోనే బ్రిటీష్ ఎంపీ అయిన ‘లార్డ్ మెకులాయ్’ 1834లో భారత్ లో పర్యటించారు. ఇక్కడి సంపద, సంపాదనను చూసి ఆశ్యర్యపోయారు. ఆయన బ్రిటీష్ దేశం వెళ్లాక 1835 ఫిబ్రవరి 2న బ్రిటీష్ పార్లమెంట్ లో కీలక ప్రసంగం చేశారు.. అది అక్కడ పత్రికల్లో అచ్చు అయ్యింది. భారత దేశ సిరిసంపదలతో తులతూగుతుందని.. అక్కడి వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ పత్రిక పాఠం ఇప్పుడు వైరల్ గా మారింది.

లార్డ్ మెకులాయ్ 1835 ఫిబ్రవరి 2న బ్రిటీష్ పార్లమెంట్ లో ప్రసంగిస్తూ ‘"నేను భారతదేశం మొత్తం ప్రయాణించాను. ఎక్కడ చూసినా ఒక బిచ్చగాడు కానీ, దొంగను కానీ చూడలేదు. అలాంటి దొంగలు, బిచ్చగాళ్లు లేని గొప్ప సంపద కలిగిన దేశాన్ని ప్రపంచంలోనే మొదటిసారి చూశాను. భారత దేశంలో చూసినటువంటి ఎంతో గొప్ప నైతిక విలువలు, విశ్వసనీయత గల ప్రజలు ఎక్కడా లేరు., ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం భారత దేశం వెన్నెముకగా ఉంది. దాన్ని మనం విచ్ఛిన్నం చేయకపోతే, ఈ దేశాన్ని జయించగలమని నేను అనుకోను. అందువల్ల, వారి సంస్కృతి ఐక్యత ని దెబ్బ తీసి అక్కడ మనం పాగా వేయాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అక్కడి పురాతన విద్యావ్యవస్థ, సంస్కృతిని నాశనం చేసి విదేశీ , ఆంగ్లమంతా వారి సొంతం అయ్యేలా మన వ్యాపించేయాలి. మన సంస్కృతి భాష గొప్పవి అని భావిస్తే, వారు వారి ఆత్మగౌరవాన్ని, వారి స్థానిక సంస్కృతిని కోల్పోతారు. మనకు కావలసినది దక్కుతుంది.భారత్ పై ఆధిపత్యం చిక్కుతుంది" అని వివరించారు.

ఇలా భారత్ ను చేజిక్కుంచుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం పన్నిన కుట్రను చేసిన దోపిడీ.. సంస్కృతిని విచ్చిన్నం చేసిన తీరుకు సంబంధించి బ్రిటీష్ ఎంపీ నాటి పార్లమెంట్ లో వ్యాఖ్యానించిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.




Tags:    

Similar News