రైతులే నన్ను బెదిరించి నాతో అలా చెప్పించారు ... మాట మార్చిన నిందితుడు !
రిపబ్లిక్ డే రోజు (జనవరి 26న ) దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చేశాడు. రైతులు రాసిచ్చిన స్క్రిప్టునే తాను చదివి వినిపించానని , నిజానికి రైతులే తనపై దాడికి పాల్పడ్డారని, వాళ్ల నుంచి ప్రాణాలు రక్షించుకునేందుకే మీడియా ముందు కట్టు కథ చెప్పానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కుట్ర ఆరోపణలు చేయకపోతే తనను చంపేస్తామని రైతులు బెదిరించి నాతో అలా చెప్పించారు అని అన్నాడు.
ఈ మేరకు సోషల్ మీడియాలో యోగేష్ వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యోగేష్ ఈ వీడియో ఎలా రికార్డ్ చేశాడన్న ప్రశ్న ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేస్తుంది. నా పేరు యోగేష్, హర్యానాలోని సోనేపాట్ కు చెందిన నేను ఈ నెల 19న పానిపట్‌కు బయలుదేరాను. అదే రోజు తిరిగి సోనేపాట్ కు బయలుదేరిన క్రమంలో రైతులు ఆందోళన చేపడుతున్న నరేలా ప్రాంతానికి వెళ్లాను.
ఆ సమయంలో అక్కడి మహిళల పట్ల కొంతమంది యువకులు తప్పుగా ప్రవర్తించడాన్ని గమనించాను. ఇదే విషయాన్ని ఆందోళనకారులకు చెప్పగా, వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మొదట నా దుస్తులు విప్పి చితకబాదారు. ట్రాలీపై వేలాడదీసి మళ్లీ కొట్టాలని చూశారు అని యోగేష్ ఆ వీడియోలో అన్నాడు.
ఆ మరుసటిరోజు రైతు సంఘాల నేతలు తనవద్దకు వచ్చి తాము చెప్పింది చేయాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాతో పాటు పట్టుకున్న మరో నలుగురిలో ఒకరిని హత్య చేసినట్లు చెప్పారు. ఆ మాట విని భయపడ్డ నేను వారు చెప్పినట్లు చేసేందుకు ఒప్పుకున్నాను. జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నలుగురు రైతు సంఘాల నేతలపై కాల్పులకు కుట్ర చేసినట్లు వాళ్లు చెప్పామన్నారు.
అదే కట్టు కథను నేను మీడియా ముందు చెప్పాను. వాళ్లు చెప్పినట్లే పోలీసులపై ఆరోపణలు చేశాను అని చెప్పాడు. శుక్రవారం రాత్రి ముసుగు ధరించి మీడియా ముందుకు వచ్చిన యోగేష్... ఈ నెల 26న నలుగురు రైతు సంఘాల నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు చెప్పిన సంగతి తెలిసిందే.