కొన్ని ఉదంతాలు కంటితో చూసినా.. నిజమని నమ్మలేనట్లుగా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురించి విన్న వారంతా విస్మయానికి గురవుతున్నారు. సాధ్యమేనా? అన్న సందేహం కలుగుతూనే.. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న దాన్ని కాదనలేని పరిస్థితి. ఇంతకూ జరిగిందేమంటే.. ఇష్టంగా తింటున్న కోడి గుడ్డు కారణంగా ఒక ప్రాణం పోవటం.అలా అని గుడ్డులో ఎలాంటి లోపం లేదు. ఇంతకూ జరిగిందేమంటే..
నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజి పేట మండలానికి చెందిన నేరళ్లపల్లి గ్రామానికి చెందిన యాభై ఏళ్ల నీలమ్మకు కోడి గుడ్లు అంటే ఇష్టం. తాజాగా ఇంట్లో భోజనానికి కోడి గుడ్లను తీసుకొచ్చి ఉడకబెట్టింది. వాటిని తినేందుకు సిద్ధమైంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఇక్కడో అనుకోని రీతిలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ఇష్టంగా కోడి గుడ్డును తినేందుకు ఆమె చేసిన ప్రయత్నం అనుకోని రీతిలో ప్రాణం పోయేలా చేసింది.
ఉడకబెట్టిన కోడి గుడ్డును నోట్లో పెట్టుకున్న నీలమ్మ.. అకస్మాత్తుగా చేయి జారి గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో.. గుడ్డు బయటకు రాక.. ఊపిరి ఆడక నానా యాతన పడిన ఆమె అక్కడికక్కడే చనిపోయారు. అప్పటివరకు తమతో పాటు ఉన్న ఆమె.. నోట్లోకి కోడిగుడ్డు పెట్టుకున్నంతనే జరిగిన పరిణామంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. జరిగిన పరిణామంతో వారంతా షాక్ కు గురైనట్లుగా చెబుతున్నారు. గొంతులో ఇరుక్కుపోయిన కోడిగుడ్డును బయటకు తీసేలోపే నీలమ్మ మరణించింది. స్థానికంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది.