నేడు పోలీసు విచారణకు ఆర్జీవీ... హైకోర్టు చెప్పిన పని చేస్తున్నారా?

సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లో నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-19 04:46 GMT

సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లో నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు! దీంతో.. ఈ రోజు ఆర్జీవీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. విచారణ అనంతరం అరెస్ట్ కు ఛాన్స్ ఉందా? చర్చ తెరపైకి వచ్చింది!

అవును... గతంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ.. ఆర్జీవీపై మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో... అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంలో వర్మకు ఏ విషయంలోనూ ఉపశమనం దగ్గలేదనే చెప్పాలి! అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించడంతో పాటు.. తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇదే సమయంలో... అరెస్ట్ పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెబుతూ... విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలంటే పోలీసులనే అభ్యర్థించుకోవాలని సూచించింది హైకోర్టు! అలా అభ్యర్థించాలన్నా కూడా ఆర్జీవీ పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంటుందని అంటున్నారు! దీంతో... నేడు ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరు కావడం కంపల్సరీ అని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసుల ముందు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు హాజరవుతారు..? ఈ మేరకు మరింత గడువు కావాలని కోరతారా..? అందుకు పోలీసులు అంగీకరిస్తారా..? అసలు విచారణ అనంతరం వర్మను పోలీసులు బయటకు వదులుతారా..? లేక, వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారా..? ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోన్న ఈ ప్రశ్నలకు కాసేపట్లో సమాధానాలు రావొచ్చు!

Tags:    

Similar News