ఘోస్ట్ రైడర్ సినిమా హాలీవుడ్ లో ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. మండుతున్న తలతో, మండుతున్న బైక్ తో హీరో వెళుతుంటే అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా దాన్ని కొంతమంది యువకులు కాపీ కొట్టి ట్రై చేశారు. బజాజ్ పల్సర్ బైక్ కు నిప్పంటించి ఘోస్ట్ రైడ్ చేయడానికి ప్రయత్నించాడు.
ఇప్పుడీ వీడియో ఇండియన్ హ్యాకర్ యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేయగా వైరల్ అయ్యింది. పల్సర్ 220 బైక్ రెండు చక్రాలకు పెట్రోల్ లో నానబెట్టిన దుస్తులను చుట్టి ఇద్దరు యువకులు బైక్ పై కూర్చొని బైక్ నడిపారు. బైక్ చక్రాలకు నిప్పంటించారు.. బైక్ చక్రాలు మంటల్లో కాలుతుండగా ప్రయాణించారు. మంటలు తాళలేక వెనుక కూర్చున్న యువకుడు బైక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. బైక్ నడుపుతున్నయువకుడు కూడా బండి ఆపి దిగేశాడు. ఈ వీడియో భయంకరంగా ఉంది. బైక్ ను కిందపడేసి నీళ్లు పోశారు.
ఇలా ఘోస్ట్ రైడర్ లో ఈ యువకులు చేసి పిచ్చి ప్రయత్నంలో ప్రాణాపాయం లేకున్నా ఈ స్టంట్ గగురుపొడుస్తోంది. సినిమాల్లో గ్రాఫిక్స్ ఉపయోగించి చేస్తారని.. అలా నిజంగా చేయడం ప్రాణాలకే ప్రమాదకరం అని నిపుణులు సూచిస్తున్నారు.
Full View