ఏకంగా ఆస్పత్రిలోనే ‘ఆ దుకాణం’ పెట్టిన మహిళా సిబ్బంది

Update: 2022-10-28 00:30 GMT
దేవాలయాల తర్వాత  అందరూ పవిత్రంగా భావించేది ఆస్పత్రులనే.. ప్రాణాలు పోసే ఆస్పత్రులను పవిత్రంగా భావిస్తారు. అలాంటి చోట్ల అపవిత్ర పనులకు చోటు ఉండదు. కానీ కొందరు ఇప్పటికీ ఆస్పత్రులను అడ్డాగా మార్చి పాడు పనులు చేస్తుంటారు. మగవాళ్లు చేస్తున్నారంటే అదో లెక్క. కానీ ఆడవాళ్లు కూడా తెగించడమే వింత. అలాంటి దారుణమే తాజాగా చోటుచేసుకుంది.  

విచిత్రమైన, అనైతిక పరిణామాలతో తెలంగాణలోని హనుమకొండ ఆసుపత్రి వార్తల్లో నిలిచింది. ఆ ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో పార్టీలు చేసుకోవడం వైరల్ అయ్యింది. వారి పార్టీకి బయటి నుండి ఇతర వ్యక్తులను కూడా రప్పించుకోవడం విశేషం.

తెలంగాణలోని హనుమకొండ హాస్పిటల్‌లో మహిళా సిబ్బంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ బీరు తాగుతూ పార్టీలు చేసుకుంటూ కనిపించారు. ప్రతిరోజూ వందలాది మంది గర్భిణులకు సేవలందించేందుకు ఉద్దేశించిన ఆసుపత్రిలో ఇదంతా చోటుచేసుకోవడం విశేషం.  ప్రసూతి వార్డులో బీరు తాగుతూ పార్టీ చేసుకుంటున్న ఆసుపత్రి సిబ్బందిని సామాన్యులు పట్టుకుని నిలదీశారు. వారి తతంగాన్ని అంతా వీడియోలు తీశారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

రోగులు,వారి బంధువులు బీర్ తాగి పార్టీ చేసుకున్న మహిళా సిబ్బందిపై మండిపడుతున్నారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.

ఆసుపత్రి చీఫ్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని ఓ గదిలో పార్టీ చేసుకుంటూ పట్టుబడిన సిబ్బందిని మందలించామని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు..

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News