యూపీలో తొలి లవ్ జిహాద్ నమోదు

Update: 2020-12-04 00:30 GMT
భారత్ లో కొంతకాలంగా లవ్ జీహాద్ పెరిగిపోతోందని పలువురు వాదిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో యువతులకు వల వేసి ఆ తర్వాత మతం మార్చుకోవాల్సిందిగా ప్రేరేపిస్తున్నారని...కొన్ని సందర్భాల్లో బలవంతంగా మతం మారుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక, కొందరు లవ్ జిహాద్ ముసుగులో ఉగ్రవాద చర్యలకు కూడా పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో లవ్ జిహాద్ పై ఉత్తర ప్రదేశ్ సర్కార్ కొద్ది రోజుల క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. లవ్ జిహాద్ పేరుతో బలవంతంగా మతం మార్చాలని చూస్తే 10 సంవత్పరాల జైలు శిక్షతోపాటు రూ.50 వేలు జరిమానా విధిస్తామని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు, లవ్ జిహాద్ బాధిత మహిళకు రూ.5లక్షల పరిహారం కూడా చెల్లించాలని చట్టంలో పొందుపరిచింది. ఈ క్రమంలో తాజాగా ఈ చట్టం కింద యూపీలో తొలి లవ్ జిహాద్ వ్యతిరేక కేసు నమోదైంది.

ఉత్తరప్రదేశ్ లోని దావా డియోరానియాలోని ఓ యువతికి లాక్ డౌన్ సమయంలో వేరే మతానికి చెందిన ఓ యువకుడితో వివాహమైంది. లాక్ డౌన్ లో తనకు పెళ్లైందని, కానీ నిందితుడు ఇపుడు ఆ యువతిని మతం మార్చుకొని మళ్లీ పెళ్లి చేసుకోవాలని అంటున్నాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో, ఆ యువకుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై యూపీ బలవంతపు మార్పిడి వ్యతిరేక చట్టం సెక్షన్ 3/5, సెక్షన్ 504, ఇండియన్ పీనల్ కోడ్ 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. దీంతో, కొత్తగా తెచ్చిన లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం కింద యూపీలో తొలి కేసు నమోదైనట్లయింది.
Tags:    

Similar News