మహరాష్ట్రలో కీలక చర్చకు తెరలేపిన తెలంగాణ ముఖ్యమంత్రి!

మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇన్ని రోజులూ హోరెత్తించిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-18 13:56 GMT

మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇన్ని రోజులూ హోరెత్తించిన సంగతి తెలిసిందే. దానికి డబుల్ డోస్.. ప్రచారం చివరి రోజైన సోమవారం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహారాష్ట్రలో ఓ కీలక అంశాన్ని లేవనెత్తారు. ఇది హాట్ టాపిక్ గా మారింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం చివరి రోజు డబుల్ హీటెక్కి పోయాయి. ఈ సమయంలో అత్యంత కీలకమైన అంశాన్ని రేవంత్ రెడ్డి లేవనెత్తారు. ఇందులో భాగంగా.. మహారాష్ట్రలో రాజకీయ వివాదం నడుస్తోన్న ముస్లిం రిజర్వేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య రాజకీయ వివాదం నడుస్తుండగా.. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా... తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్స్ ని ఒక ఉదాహరణగా ప్రస్థావించిన ఆయన.. పేదలకు, నిరుపేదలకు న్యాయం జరిగేలా చూడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయని తెలిపారు. ఐదు శాతం ఇవ్వాలని ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీలు కాలేదని అన్నారు!

ఇక ఇటీవల తెలంగాణలో 11,000 మంది ఉపాధ్యాయ నియామకాలు జరిగాయని.. అందులో 720 మంది ముస్లింలు రిజర్వేషన్లు కింద రిక్రూట్ అయ్యారని.. మహరాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముస్లిం రిజర్వేషన్స్ పై చర్చిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి!

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు