దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. విన్నంతనే వణికే ఈ ఉదంతంలోకి వెళితే.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. అతనితో పాటు చదువుకునే విద్యార్థులే చంపేశారు. ఆగ్రేయ ఢిల్లీ లోని బదర్ పుర్ సమీపం లోని కాలువలో విద్యార్థి డెడ్ బాడీ కనిపించింది. స్కూల్ డ్రెస్ లో ఉన్న అతడ్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ విద్యార్థిని సౌరభ్ గా గుర్తించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ బ్యాగ్ ఆధారంగా విద్యార్థి చదువుతున్న స్కూల్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సౌరభ్ తో కలిసి చదువుకునే అతడి స్నేహితుల్ని పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారికి షాకింగ్ నిజం తెలిసింది. నిందితుల్లో ఇద్దరు స్కూల్ ఆవరణలో సిగిరెట్ తాగుతూ సౌరభ్ కంట పడ్డారు.
తాము సిగిరెట్ తాగుతున్న విషయాన్ని క్లాస్ టీచర్ కు చెబుతాడని సౌరభ్ చెప్పాడు. దీంతో.. భయపడిన ఇద్దరు విద్యార్థులు సౌరభ్ ను పక్కనే ఉండే మారుమూల ప్రాంతానికి లాక్కెళ్లి తల మీద బల మైన వస్తువుతో కొట్టి చంపేశారు. అనంతరం అతడి డెడ్ బాడీని కాలువలో పడేశారు. సౌరభ్ ప్రాణాలు తీసిన విద్యార్థులు మైనర్లుకావటంతో.. వారిని జువైనల్ హోంకు తరలించారు. జువైనల్ బోర్డు ఎదుట హాజరుపర్చనున్నారు.