కరోనా పోరులో అందరికంటే అలిసిపోతోంది వైద్యులు.. నర్సులు.. వైద్య సిబ్బందినే.. కానీ వారికి చికిత్స నందించేందుకు ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో చేసేదేం లేక ఆ వైద్య సిబ్బందియే ఏకంగా చందాలు వేసుకొని 50 పడకలతో ఓ కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కేవలం వైద్య సిబ్బందికే సేవలందిస్తున్నారు.ఈ దారుణం బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బీహార్ లో ఇప్పటికే 300మందికి పైగా వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో వైద్యరంగం పరిస్థితి బాగాలేదని.. పట్నాలోని ఎయిమ్స్ లో కనీసం 50శాతం పడకలు వైద్యసిబ్బంది కోసం కేటాయించాలని వైద్యులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు.
దీంతో వైద్యులు తమ కరోనాతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుండడం.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొందరు వైద్యులు చందాలు వేసుకొని 50 పడకలతో ఓ కోవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ రోగులకు చికిత్స చేస్తూ కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే చికిత్సలు చేస్తున్నారు.