అధికారం చేతిలో ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పవర్ లేని వేళ.. హామీలే తప్పించి.. అమలు సాధ్యం కాదు. కానీ.. అధికారంలోకి వచ్చినప్పుడు హామీలన్నింటిని అమలు చేసే వీలుంది. చాలామంది అధినేతలు.. తాము అధికారంలో ఉన్న వేళలో.. పదవుల పంపకంపై పెద్దగా ఆసక్తిని ప్రదర్శించరు. కానీ..కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
దాదాపు పదేళ్లకు పైనే పవర్ కు దూరంగా ఉన్న ఆయన.. తనకు మద్దతుగా నిలిచే వారికి ఎన్నో హామీలు ఇచ్చేవారు కానీ.. పదవులు ఇవ్వలేకపోయేవారు. అధికారంలో ఉన్న వేళ.. వీలైనంత మందికి పదవుల్ని ఇచ్చేందుకు ఆయన చేసిన ఆలోచన చూస్తే.. పవర్ ను పంచటం ఎలానో అర్థమవుతుంది. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో.. డిప్యూటీ మేయర్ పదవుల్ని ఇద్దరికి ఇచ్చేలా కొత్త మార్పు చేపట్టారు.
ఎలా అయితే.. డిప్యూటీ సీఎం పదవుల్ని ఇద్దరుకు ఇస్తారో.. అదే తీరులో డిప్యూటీ మేయర్లు.. వైస్ ఛైర్మన్ పదవుల్ని ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీంతో.. పదవుల్ని వీలైనంత ఎక్కువ మందికి పంచటానికి వీలవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనకు తాజాగా ఏపీ గవర్నర్ కూడా ఓకే చెప్పేశారు. అయితే.. ఇలాంటి వాటికి న్యాయపరమైన చిక్కులు చోటు చేసుకునే వీలుంది. అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు వీలుగా ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తయారు చేసినట్లు చెబుతున్నారు. దీంతో.. ఏపీ వ్యాప్తంగా ఇక అన్ని మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో వైస్ ఛైర్మన్.. డిప్యూటీ మేయర్ పదవుల్ని ఇద్దరికి ఇవ్వనున్నారు.తమకు పదవులు ఇవ్వటానికి అధినేత పడుతున్న తపనను వైసీపీ నేతల్ని మరింత ఆనందానికి గురయ్యేలా చేస్తోంది.