రాజకీయ కండువా కప్పుకున్న ది గ్రేట్‌ ఖలీ!

Update: 2016-08-14 12:50 GMT
డబ్లూడబ్లూఈ రెజ్లింగ్ ఆటలో ప్రపంచ స్థాయి ఆటగాడిగా కీర్తి సంపాదించిన ఇండియన్ ఎవరంటే.. ఆ ఆట గురించి తెలిసినవారు, ఆ ఆటను చూసేవారు టక్కున చెప్పేపేరు గ్రేట్ ఖలీ! 7.1 అడుగుల ఎత్తుతో మాంచి బలిష్టంగా ఉండే ఈ పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిఫ్ కైవసం చేసుకున్నాడు. ఇలా ఇప్పటివరకూ రెజ్లింగ్ ఆటగాడిగానే ఉన్న ది గ్రేట్ ఖలీ.. ఇప్పుడు పొలిటీషియన్ గా కూడా మారబోతున్నారు.
 
ఇట్టివల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి తన సత్తా చాటిన కేజ్రీవాల్ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్)లో ఖలీ చేరారు. ది గ్రేట్‌ ఖలీగా పేరొందిన దిలీప్‌ సింగ్‌ రాణా ఆదివారం ఆప్‌ ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా.. పార్టీ నేతలు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇప్పటికే పంజాబ్ కు చెందిన పలువురు నేతలకు, ముఖ్యంగా క్రీడాకారులకు గాలం చేస్తోన్న ఆప్ కి.. ఖలీ రూపంలో మంచి ప్రతిఫలమే వచ్చింది.

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఈ పార్టీ పంజాబ్‌ ఎన్నికలే టార్గెట్‌ గా పలు వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ ఈ రకంగా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుంది. ఈ సమయంలో గ్రేట్ ఖలీ రూపంలో వారికి మంచి మద్దతు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ - మాజీ క్రికెటర్ - వ్యాఖ్యాత నవజ్యోతి సింగ్ సిద్ధూ కు కూడా ఆప్ ఆకర్షిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News