కేంద్ర ఆర్థికమంత్రి పై ఫైర్ అయిన ఆ హీరో .. ఏ విషయంలో అంటే ?

Update: 2021-02-22 10:30 GMT
దేశంలో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతుండటం తో సామాన్యుల బతుకుబండి నడవడం కష్టంగా మారుతుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే  హీరో సిద్ధార్థ  విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పై సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో విమర్శలు కురిపించారు.  'మామి తరువాతి స్థాయికి చేరుకున్నారు. 'ఉల్లిపాయలు లేవు, మెమరీ లేదు,  ప్రిన్సిపల్స్‌ లేవు.. మామి రాక్స్‌' అంటూ ట్వీట్‌ చేశారు.

అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలును జీఎస్ ‌టీ పరిధిలోకి తీసుకువస్తే.. ధరలు దిగొచ్చే అవకాశం ఉందని  నిర్మలా  గతవారం వ్యాఖ్యానించారు. ధరల అదుపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక యంత్రాంగాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇక పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ఇప్పటికే మీమ్స్‌, వ్యంగ్యోక్తులతో బీజేపీ సర్కార్‌ పై నెటిజన్లు విరుచుక పడుతున్నారు.

పెట్రోలు ధరలను భారీగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారంటూ  2013లో కాంగ్రెస్‌ ప్రభుత‍్వంపై మండిపడిన నిర్మలా సీతారామన్‌, తాజా పెంపుపై మాత్రం ఆర్థికమంత్రిగా దానికి భిన్నంగా స్పందించారు. ఇంధన ధరల పెంపుకి  ఆయిల్‌ కంపెనీలే బాధ్యత వహించాలని, ఇంధన ధరల నియంత్రణ  కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదని పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో  వైరల్ ‌గా మారిన సంగతి తెలిసిందే.

గడచిన రెండు వారాలుగా నిత్యమూ లీటరుపై 30 పైసల నుంచి 40 పైసల వరకూ పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు, నేడు మారలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, ఇండియాలో మాత్రం ధరలను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మార్చలేదు.

ఇప్పటికే పెట్రోలు ధర ఇండియాలోని చాలా ప్రాంతాల్లో సెంచరీ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్థాయిలో ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర పన్నులే కారణమన్న విషయం కూడా తెలిసిందే. చాలా దేశాల్లో పెట్రోలు ధరలు ఇండియాతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి.  కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజలపై ఉన్న భారాన్ని తగ్గించేలా సుంకాలను తగ్గించినా, అది కేవలం రూ. 3 నుంచిరూ. 5 వరకే పరిమితమైంది.
Tags:    

Similar News