జీవో నంబర్ వన్...తీర్పుతో ఏపీ రాజకీయాల్లో మార్పు

Update: 2023-01-24 09:02 GMT
బహిరంగ సభలు, రోడ్‌సైడ్ సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ  వివాదాస్పద ప్రభుత్వ ఉత్తర్వు జీవో నంబర్ వన్ ని ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ జీవోతో రోడ్ షోలు రోడ్ల మీద సభలకు అవకాశం ఉండదని పేర్కొంది. దానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఈ జీవోను విపక్షాలు కోర్టులో సవాల్ చేశాయి. సంక్రాంతి సెలవుల నేపధ్యంలో వెకేషన్ కోర్టు  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ దాఖలు చేసిన పిటిషన్ని విచారించి ఈ నెల 23 వరకూ జీవోను సస్పెండ్ చేశారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది.

అయితే సుప్రీం కోర్టు దీన్ని హై కోర్టు విచారించాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసుని ఈ రోజు హై కోర్టు చీఫ్ జస్టిస్ ఆద్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. వెకేషన్ కోర్టు ఈ కేసుని లంచ్ మోషన్ కింద తీసుకోవాల్సిన ప్రాధాన్యత అర్జెన్సీ ఏముందని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

వెకేషన్ కోర్టు లో ప్రతీదీ అత్యవసర కేసుల తీసుకుంటే ఎలా అని కూడా అన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసు మూలలు అన్నీ తనకు తెలుసు అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నరు. ఎప్పటికపుడు కీలక సమాచారాన్ని తాను హై కోర్టు రిజిస్ట్రీ నుంచి తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

ఇక ఈ కేసు విషయంలో అటు పిటిషన్ తరఫున ఇటు ప్రభుత్వం తరఫున వాదనలు జరిగాయి. ఈ జీవో మీద సస్పెన్షన్ కొనసాగించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. ప్రభుత్వం ఏ ఒక్కరికి వ్యతిరేకంగానో జీవో ఇవ్వలేదని, ప్రజా ప్రయోజనం కోసమే ఈ జీవో అని ప్రభుత్వ న్యాయ వాదులు పేర్కొన్నారు. ప్రజా భద్రత  ప్రజా శాంతి ప్రయోజనాల దృష్ట్యా నియంత్రించే రాష్ట్ర అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని పేర్కొంది.

ప్రజారోడ్డుపై జరిగిన బహిరంగ సభలో ఎనిమిది మంది మృతి చెందిన నేపథ్యంలో ని జీవోను జారీ చేశామని  వాదించారు. అయితే మధ్యంతర స్టేను పొడిగించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం నిరాకరించింది  కేసును తదుపరి విచారణకు మంగళవారం వాయిదా వేసింది. ఈ నెల 24న జరిగే విచారణలో ఈ జీవో విషయంలో తుది తీర్పు ఏంటి అన్నది హై కోర్టు వెల్లడించనుంది.

ఇదిలా ఉండగా ఈ జీవో మీద ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి ఉంది. అలగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా ఉంది. దాంతో ఈ జీవోని కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇస్తే విపక్షాలకు అది వరమే అవుతుంది. కాకుండా కొనసాగించేలా ఉంటే అది ప్రభుత్వ విజయం అవుతుంది. అపుడు యాత్రల మీద కట్టడి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ జీవో విషయమై ఏపీలో అతి పెద్ద రాజకీయ యుద్ధమే సాగుతుంది అని చెపాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News