ఆ జడ్జికున్న పాడు బుద్ధిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు

Update: 2021-11-02 03:47 GMT
సమాజంలో ప్రత్యేకమైన స్థానం న్యాయమూర్తులకు ఉంటుంది. అందరిలోకలిసి ఉన్నా.. వారిని మాత్రం మిగిలిన వారికంటే ప్రత్యేకంగా చూడటం తెలిసిందే. తీర్పులిచ్చే న్యాయమూర్తులకు సమాజంలో ఉండే గౌరవ మర్యాదలు అన్ని ఇన్ని కావు. అలాంటి అత్యుత్తమ స్థానంలో ఉన్న ఒక న్యాయమూర్తి చేసిన ఎదవ పని గురించి తెలిస్తే నోట మాట రాదు. దరిద్రపుగొట్టు బుద్ధితో అతగాడు వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు వేగంగా స్పందించి షాకిచ్చే నిర్ణయాన్ని వెల్లడించింది. రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది.

భరత్ పుర్ ప్రత్యేక జడ్జిగా వ్యవహరిస్తున్న జితేంద్ర గొలియా పద్నాలుగేళ్ల బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీబీ కేసుల్ని విచారించే ఈ జడ్జితో పాటు.. ఆయన సహాకులు ఇద్దరు కూడా తన కొడుకును లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. పిస్టల్ తో కాల్చి చంపుతామని బెదిరిస్తున్నట్లుగా ఆమె వాపోయింది.

భర్త లేని తాను తన కొడుకుతో కలిసి జీవిస్తున్నామని.. తమ మీద వారి బెదిరింపులపై ఆమె వేదన వ్యక్తం చేశారు. ఏడో తరగతి చదివే బాధిత కుర్రాడు.. భరత్ పుర్ లో గ్రౌండ్ కు వెళ్లి ఆడుకునేవాడు. అక్కడికి జడ్జి జితేంద్రతో పాటు.. ఆయన సహాయకులుఇద్దరూ వచ్చే వారు. వారు బాలుడితో అసభ్యంగా వ్యవహరించేవారు.. ఆ కుర్రాడికి మాయమాటలు చెప్పి.. తమతో తీసుకెళ్లి మద్యం.. మత్తుపదార్థాలు ఇచ్చేవారని.. మత్తులో మునిగిన తర్వాత తప్పుడు పనులు చేసేవారన్న ఫిర్యాదును బాధితుడి తల్లి పోలీసులకు ఇచ్చారు.

దీంతో స్పందించిన మథుర గేట్ పోలీసులు.. పోక్సో కేసును నమోదు చేసిన విచారణ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన హైకోర్టు వెంటనే.. జడ్జి మీద సస్పెన్షన్ ఉత్తర్వుల్ని జారీ చేశారు. అంతేకాదు.. బాలుడ్ని బెదిరించిన ఏసీబీ అధికారి పరమేశ్వర్ లాల్ యాదవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉదంతం సంచలనంగా మారింది.


Tags:    

Similar News