కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మొదలైన హిజాబ్ ఇష్యూ.. చాలా త్వరగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోకి విస్తరించింది. హిజాబ్ ధరించి వచ్చే అమ్మాయిలకు పోటీగా.. కాషాయ కండువాలతో మరో వర్గానికి చెందిన అమ్మాయిలు విద్యాసంస్థలకు రావటం.. వారిని అడ్డుకోవటంతో ఇదో ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే.
విద్యా సంస్థల్లో అందరూ ఒకేలా ఉండాలని.. హిజాబ్ ధరించకుండా ఉండాలని పట్టుబడుతుంటే.. అందుకు సదరు అమ్మాయిలు ససేమిరా అంటున్నారు. అందుకు ప్రతిగా.. తాము కూడా కాషాయ కండువాలు వేసుకొని విద్యాసంస్థలకు వస్తామంటూ మరో వర్గానికి చెందిన అమ్మాయిలు విద్యా సంస్థల్లోకి రావటం.. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయటాన్ని సదరు వర్గానికి చెందిన అమ్మాయిలు తమ విషయంలో ఎందుకిలా? అని ప్రశ్నిస్తున్నారు.
దీంతో హిజాబ్ అనుకూల.. వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు కాస్తా ఘర్షణలుగా మారటమే కాదు.. ఈ ఇష్యూ మీద కొందరు విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ ఇష్యూలో హిజాబ్ ధరించే వారికి అనుకూలంగా నీలి కండువాలు వేసుకొన్న మరికొందరు మద్దతు ఇవ్వటంతో ఇష్యూ ఎక్కడికెక్కడితో వెళ్లిపోతున్న పరిస్థితి.
పలు జిల్లాల్లో హిజాబ్ ఇష్యూ పెద్దదిగా మారటమే కాదు.. కాలేజీలకు సెలవుల్ని ప్రకటించే వరకు వెళ్లటం గమనార్హం. తాజాగా కర్ణాటకలోని విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవుల్ని ప్రకటించటం చూస్తే.. ఇష్యూ ఎంత తీవ్రంగా మారిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
హిజాబ్ ఇష్యూ తీవ్రం కావటం.. పలుచోట్ల ఘర్షణ పూరిత ఉదంతాలు చోటు చేసుకున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవుల్ని ప్రకటిస్తూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు జారీ చేశారు. అందరూ సంయమనంతో వ్యవహరించాలని ట్వీట్ చేశారు.
హిజాబ్ ఇష్యూ ఇప్పుడెంత పెద్ద ఇష్యూగా మారిందంటే.. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల వద్ద పెద్ద ఎత్తున నిరసనకు.. ఆందోళనలకు.. పోటాపోటీ బల ప్రదర్శనకు వేదికగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై ఉడుపి ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కళాశాల విద్యార్థినులు కర్ణాటక హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రజలు.. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని.. కొందరి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేయటం మంచిది కాదని స్పష్టం చేసింది.
హిజాబ్ ధరించిన విద్యార్థుల్ని మరికొందరు అడ్డుకోవటం.. కాషాయ కండువాలు ధరించి వచ్చిన వారిని విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవటం ఇష్యూగా మారింది. శివమొగ్గలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఈ ఇష్యూ పెద్దదిగా మారటమే కాదు.. ఇరు వర్గాల విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే వరకు విషయం వెళ్లటం గమనార్హం.
ఈ ఉదంతంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాషాయ కండువాల్ని కప్పుకొని వచ్చిన విద్యార్థుల్ని కాలేజీలోకి అనుమతించకపోవటంతో వారు కాలేజీ బయట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మరో వర్గానికి చెందిన విద్యార్థులు రావటం.. వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఇష్యూ రాళ్లదాడి వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.
కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో హిజాబ్ ఇష్యూ అంతకంతకూ ముదురుతోంది. తాజాగా బాపూజీ నగర్, ఉడిపి, బాగల్ కోట్.. విజయపుర.. మండ్య..తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థల వద్ద హిజాబ్ ఇష్యూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేశారు.
విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని.. హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దన్నారు. పోలీసుల్ని ప్రయోగించే వరకు ఇష్యూను తీసుకెళ్లొద్దన్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా హిజాబ్ ఇష్యూ పార్లమెంటును తాకింది. కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.