ఆమె ఫైర్ బ్రాండ్. ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. వివాదమే.. వివాదాస్పదమే! ఆమే.. బీజేపీ పార్లమెంటు సభ్యురాలు, సన్యాసిని ప్రగ్యా ఠాకూర్. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు.. తీవ్ర వివాదానికి దారితీశాయి. తాజాగా కూడా ఆమె ఇలాంటి వివాదాస్పద కామెంట్లు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి అందరి దృష్టినీ ఆమె ఆకర్షించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. హిందువులూ.. కత్తులు రెడీ చేసుకోండి! అనే!!
హిందువులంతా తమను తాము కాపాడుకునేందుకు పదునైన కత్తులను ఇళ్లలో ఉంచుకోవాలని, ఎప్పటిక ప్పుడు అవి పదునుగా ఉన్నాయో లేవో పరీక్షించి చూసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శివమొగ్గలో జరుగుతున్న హిందూ జాగరణ్ మంచ్ దక్షిణ ప్రాంత సదస్సులో ఆమె మాట్లాడారు. 'మనపైనా, మన గౌరవం పైనా దాడులు చేస్తుంటే, వారిని ఎదుర్కోవడం మన హక్కు' అని ఆమె వ్యాఖ్యానించారు.
'లవ్ జిహాద్ వారికి ఒక సంప్రదాయంగా మారింది. హిందువులూ ప్రేమిస్తారు. అయితే వారు దేవుడిని ప్రేమిస్తారు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెబుతారు. లవ్ జిహాద్ ప్రయోగించే వాళ్లకు అదే పద్ధతిలో జవాబు చెప్పాలి. ఆడ పిల్లలను రక్షించుకునేందుకు వారికి విలువలు నేర్పించాలి' అని ప్రగ్యా అన్నారు. కొందరి నుంచి కాపాడుకునేందుకు, వ్యక్తిగత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పదునైన కత్తులు ఇంటిలో ఉంచుకోవాలని సూచించారు.
ఎలాంటి దాడులు జరగనప్పుడు వాటిని కూరగాయలు కోసుకునేందుకైనా వాడుకోవచ్చునని ప్రగ్యా వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్పటికప్పుడు పదును మాత్రం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. మైనారిటీ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.