`జియో` అంబానీ ఐడియా కాదా?

Update: 2018-03-16 11:37 GMT
క‌ర్లో దునియా ముట్టీ మే... అంటూ కొద్ది సంవ‌త్స‌రాల క్రితం మొబైల్ ఫోన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది రిల‌య‌న్స్. అదే త‌ర‌హాలో 2016లో జియో డిజిట‌ల్ లైఫ్ (డిజిటల్ జీవితాన్నిఆస్వాదించండి) అంటూ జియో సిమ్ ను ప్ర‌వేశ‌పెట్టారు ముకేశ్ అంబానీ. జియో రాక‌తో నిజంగానే ప్ర‌జ‌లు గుప్పిట్లో డిజిటల్ ప్ర‌పంచం ఇమిడిపోయింది. అప్ప‌టివ‌ర‌కు సామాన్యుడికి అంద‌ని ద్రాక్షగా ఉన్న‌మొబైల్ డేటాను....అతి చౌక ధ‌ర‌కే అందుబాటులోకి తెచ్చిన‌ జియో....టెలికాం రంగంలో ప్ర‌క‌పంన‌లు సృష్టించింది. దిగ్గ‌జ కంపెనీల‌న్నీ జియో దెబ్బ‌కు కుదేల‌య్యాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్ డేటా వాడ‌కంలో 150వ స్థానంలో ఉన్న భార‌త్ అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డం జియో చ‌ల‌వే. ప్రవేశపెట్టిన రెండు సంవ‌త్స‌రాలలోనే ప్రపంచంలో అతిపెద్ద మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ డేటాగా ఖ్యాతి గ‌డించింది. అయితే - ఇప్ప‌టివ‌ర‌కు `జియో` వెనుక ఉన్న మాస్ట‌ర్ బ్రైన్ ముకేశ్ అంబానీద‌ని అంతా అనుకుంటున్నారు. అయితే, త‌న‌ ముద్దుల కూతురు ఇషా ఐడియాతోనే తాను జియోకు శ్రీ‌కారం చుట్టాన‌ని  స్వ‌యంగా అంబానీ వెల్ల‌డించారు. గురువారం నాడు రిలయన్స్‌ సంస్థ ‘డ్రైవర్స్‌ ఆఫ్ ఛేంజ్‌’ అవార్డును అందుకున్న సంద‌ర్భంగా అంబానీ అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు.

2011లో సెలవుల‌ను స‌ర‌దాగా గ‌డిపేందుకు అమెరికా నుంచి ఇండియాకు వ‌చ్చింద‌ని - తన కోర్సుకు సంబంధించిన వర్క్‌ చేసుకుంటూ ఇంట్లో ఇంట‌ర్నెట్ చాలా నెమ్మ‌దిగా ఉంద‌ని చెప్పింద‌ని అంబానీ గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో డిజిటల్‌ టెక్నాలజీ....ప్ర‌పంచాన్ని శాసిస్తుంద‌ని - ఇషా - ఆకాశ్ త‌న‌తో చెప్పారన్నారు. అలా ఇషా ఆలోచ‌న‌ నుంచి జియో ఆవిర్భ‌వించింద‌న్నారు. ఆ ఆలోచ‌న‌ను 2016 సెప్టెంబర్ లో ఆచ‌ర‌ణ‌లో పెట్టాన‌ని అన్నారు. భార‌త దేశ డిజిట‌ల్ రూపు రేఖ‌ల‌ను జియో స‌మూలంగా మార్చి వేసింద‌న్నారు. 2జీ నెట్‌ వర్క్ ను భారతీయ టెలికాం రంగం 25 ఏళ్లలో ఏర్పాటు చేసింద‌ని, మూడేళ్ల‌లోనే 4జీ ఎల్‌ టీఈ నెట్‌ వర్క్ ను జియో రూపొందించింద‌ని అన్నారు. త్వ‌ర‌లో 5జీ కూడా సిద్ధమవుతోందన్నారు. త్వరలో జియో కొత్త డేటా కనెక్ట్‌ ప్రక్రియను ప్రవేశపెట్టబోతున్నామ‌ని అంబీనీ అన్నారు. దీని ద్వారా ఇళ్లు - వ్యాపార స‌ముదాయాలు - కార్లకు నెట్‌ కనెక్షన్లు ఏర్పాటుచేయ‌వ‌చ్చ‌న్నారు. భార‌త్ లో ప్రతిభావంతులైన యువత చాలామంది ఉన్నారని, 2028 నాటికి భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవ‌త‌రిస్తుంద‌ని అంబానీ ఆశాభావం వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News